వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల సునీతకు షాక్ ... బుల్లెట్ వ్యవహారంలో చిన్న కొడుకు పరిటాల సిద్ధార్థ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

|
Google Oneindia TeluguNews

అసలే అధికారంలో లేక ఇబ్బంది పడుతున్న టిడిపి నేతలకు వరుస కష్టాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత కు కొడుకు వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. పరిటాల సునీత చిన్న కొడుకు సిద్ధార్థ్ శ్రీనగర్ వెళ్ళటం కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లి బ్యాగ్ లో బుల్లెట్టు దొరికి పోవడంతో ఈ బుల్లెట్ వ్యవహారం గట్టిగానే పరిటాల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది.

టీడీపీలో తాజా పరిస్థితికి లోకేష్ కారణమా ? బాబు నిర్లిప్తతపై బుచ్చయ్య ఎపిసోడ్ తో ఏపీలో హాట్ టాపిక్ !!టీడీపీలో తాజా పరిస్థితికి లోకేష్ కారణమా ? బాబు నిర్లిప్తతపై బుచ్చయ్య ఎపిసోడ్ తో ఏపీలో హాట్ టాపిక్ !!

పరిటాల సునీత చిన్న కొడుకు బ్యాగ్ లో బుల్లెట్ .. ఎయిర్పోర్ట్ పోలీసుల కేసు నమోదు

పరిటాల సునీత చిన్న కొడుకు బ్యాగ్ లో బుల్లెట్ .. ఎయిర్పోర్ట్ పోలీసుల కేసు నమోదు

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కొడుకు సిద్ధార్థ ఆగస్టు 18వ తేదీన ఉదయం శ్రీనగర్ వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బ్యాగ్ ను పరిశీలించిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది పరిటాల సిద్ధార్థ బ్యాగ్లో 5.5 ఎం ఎం బుల్లెట్ కనుగొన్నారు. సాయుధ బలగాలు వాడే బుల్లెట్ సిద్ధార్థ్ బ్యాగ్ లో దొరకటంతో ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు ఆయుధాల చట్టం కింద పరిటాల సిద్ధార్థ్ పై కేసు నమోదు చేశారు.

విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్ ..

విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్ ..

పరిటాల సిద్ధార్థ్ బ్యాగ్ లో దొరికిన బుల్లెట్ తన దగ్గరకు ఎక్కడి నుండి వచ్చిందో సమాధానం చెప్పాలని 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. పోలీసులు ,ఆర్మీ వాళ్ల దగ్గర ఉండే బుల్లెట్ అతని దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పాలని ,ఎవరిచ్చారో చెప్పాలని పేర్కొన్నారు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ పోలీసుల నోటీసులకు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది.

సమాధానం ఇవ్వకపోవటంతో బిగుస్తున్న ఉచ్చు

సమాధానం ఇవ్వకపోవటంతో బిగుస్తున్న ఉచ్చు

బ్యాగ్ లో బుల్లెట్ ఉందని, దానికి కావలసిన పత్రాలు తనవద్ద లేవనే విషయం తనకు తెలియదని పరిటాల సిద్ధార్థ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో మరోమారు హాజరు కావాల్సి ఉంటుందని సిద్ధార్థ ను పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల సలహాతో ఎయిర్ పోర్ట్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని డెడ్లైన్ విధించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుల్లెట్ వ్యవహారంలో పరిటాల సునీత చిన్న కొడుకు పరిటాల సిద్ధార్థ పోలీసులకు సరైన సమాధానం చెప్పలేక పోతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో పరిటాల సిద్ధార్థ కు ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తుంది.

Recommended Video

Jaggareddy surprised everyone by singing a devotional song at the Husnapur temple
 పరిటాల సిద్ధార్థ్ వద్ద దొరికిన బుల్లెట్ ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ .. కొనసాగుతున్న దర్యాప్తు

పరిటాల సిద్ధార్థ్ వద్ద దొరికిన బుల్లెట్ ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ .. కొనసాగుతున్న దర్యాప్తు

పరిటాల సిద్ధార్థ కు లైసెన్స్ ఉన్న గన్ ఉంది . కానీ అది పాయింట్ 32 క్యాలిబర్ గన్. ఎయిర్ పోర్ట్ లో సిద్ధార్థ బ్యాగ్ లో దొరికింది 5.5 క్యాలిబర్ బుల్లెట్, దానిని సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ గా గుర్తించారు. అయితే అనంతపురానికి చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కు సంబంధించిన బుల్లెట్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కానిస్టేబుల్ తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్న నేపథ్యంలో అతని బుల్లెట్, సిద్ధార్థ వద్దకు ఎలా వచ్చిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు ముందు ముందు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary
Siddhartha, the youngest son of former minister Paritala Sunitha, left for Shamshabad Airport on the morning of August 18 to fly to Srinagar. CISF personnel inspected the bag while trying to go to Srinagar with friends found a 5.5mm bullet in Paritala Siddhartha's bag. The bullet used by the armed forces was found in Siddharth's bag and the airport police were informed. Airport police seized the bullet have registered a case against Paritala Siddharth under the Arms Act. Attending the hearing, he appeared to be tightening the noose by not answering properly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X