అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్లో తెలంగాణకు షాక్, పగోలో టీ బస్సు నిలిపివేత
హైదరాబాద్/ఏలూరు: తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌లో చుక్కెదురైంది. కానిస్టేబుళ్ల రివర్షన్ పైన ట్రైబ్యునల్ గురువారం స్టే ఇచ్చింది. కానిస్టేబుళ్ల రివర్షన్ పైన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జీవో ఇచ్చింది.
ఈ జీవోను సవాల్ చేస్తూ కానిస్టేబుళ్లు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్ జీవో పైన స్టే విధించింది.

తెలంగాణ ఆర్టీసీ బస్సులు నిలిపివేత
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులను నిలిపి వేశారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో బస్ పాసులను అనుమతించడం లేదని ప్రయాణీకులు నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications