వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయికి షాక్: రాజ్యసభ ఎన్నికలపై జగన్ ప్లాన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విజయసాయి రెడ్డికి అనూహ్యమైన షాక్ తగిలే అవకాశం ఉంది. అసలు రాజ్యసభ ఎన్నికల బరిలోంచే తప్పుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.

రాజ్యసభ సీటును విజయసాయి రెడ్డికి జగన్ ఎప్పుడో ఖాయం చేశారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభకు పోటీయే పెట్టకూడదనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే పార్టీని వీడుతుండడంతో జగన్ సంచలనం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

తమకు రాజ్యసభ సీటు దక్కకుండా చూసేందుకే టిడిపి నాయకత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందున, అసలు పోటీ నుంచి వైదొలగితే ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా పార్టీని కాపాడుకోవడంతోపాటు, ప్రజల నుంచి సానుభూతి లభిస్తుందని జగన్ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

Shock to Vijaya sai: YCP may not contest RS elections

మరో పది, పదిహేను రోజుల పాటు వేచి చూసి, అప్పటి పరిణామాలు పరిశీలించిన తర్వాత ఎంతమంది ఉంటారన్న అంచనాకు రానున్నారు. ఆ తర్వాత స్వయంగా జగనే ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారయిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నారు. పార్టీని వీడుతున్న వారితో చర్చలు జరుపుతున్నారు.

గత రెండేళ్ల నుంచి అధినేత జగన్‌తో సన్నిహితంగా ఉంటున్న విజయ సాయికి, రాజ్యసభ ఇవ్వాలని ఏడాది క్రితమే నిర్ణయించారు. ఆ ఫలితంగానే మైసురారెడ్డి పార్టీ నుంచి తప్పుకున్నారు. మొత్తం 45 మంది మంది ఎమ్మెల్యేలు, పార్టీని వీడను న్నారన్న వార్తలు జగన్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అదే జరిగితే విజయానికి కావలసిన 42 మంది ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లభించడం కష్టం. అందుకే అసలు పోటీకి దూరంగా ఉంటే ఈ ఇబ్బందులు ఉండవని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనకపోతే పార్టీ ఫిరాయింపులు ఆగిపోతాయని కొందరు జగన్‌కు సూచించినట్లు తెలిసింది. గతంలో తమిళనాడులో అన్నాడిఎంకె విపక్షంలో ఉన్నప్పుడు, జయలలిత ఎలాంటి ఎన్నికల్లోనూ పాల్గొనకుండా ఎన్నికలకు దూరంగా ఉన్నారని, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎంతమంది పార్టీలో ఉంటారోనని నిర్థరణ చేసుకుని, అప్పుడు స్వయంగా జగనే మీడియా ముందుకొచ్చి, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిడిపి విధానాలకు నిరసనగా, తాము రాజ్యసభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు.

English summary
It is said that YS Jagan's YSR Congress may not field its candidate in Rajya Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X