తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా పేషెంట్ల మృతదేహాలనూ వదలట్లేదు... తిరుపతిలో వెలుగుచూసిన దారుణం...

|
Google Oneindia TeluguNews

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి జీఎస్-2లో బుధవారం(సెప్టెంబర్ 23) ఓ పేషెంట్ కరోనాతో మృతి చెందాడు. అయితే పేషెంట్ చనిపోయాక అతని ఎడమ చేతికి ఉన్న రెండు ఉంగరాలు మాయమయ్యాయి. చివరి చూపు కోసం మార్చురీ వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించారు. అనంతరం ఆస్పత్రి భద్రతాధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగలే ఈ పని చేసి ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అటామిక్ సైంటిస్ట్,పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత... బలి తీసుకున్న కరోనా...అటామిక్ సైంటిస్ట్,పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత... బలి తీసుకున్న కరోనా...

వార్డు బాయ్ కాజేశాడా...?

వార్డు బాయ్ కాజేశాడా...?

చనిపోయిన ఆ పేషెంట్ పేరు వెంకటరత్నం అని తెలుస్తోంది. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లికి చెందిన ఆయన ఈ నెల 14న కరోనాతో తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడం గుండెపోటు రావడంతో బుధవారం మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఓ ప్రత్యేక బ్యాగ్‌లో అమర్చే క్రమంలో వార్డు బాయ్ అతని ఎడమ చేతికి వున్న రెండు ఉంగరాలను లాగేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

గతంలోనూ ఇలాంటి చోరీలు...

గతంలోనూ ఇలాంటి చోరీలు...

గతంలోనూ ఇలాగే కరోనా పేషెంట్ల మృతదేహాలపై బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది అగస్టులో కరోనాతో తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వీరలక్షణ సింగ్ అనే వ్యక్తి ఆభరణాలు కూడా చోరీకి గురయ్యాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మృతుడి కుటుంబం వాపోయింది. మంత్రి ఆళ్ల నాని ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించినప్పటికీ.. ఆస్పత్రుల్లో ఈ తరహా చోరీలకు ఫుల్ స్టాప్ పడకపోవడం గమనార్హం. తాజా ఘటనపై స్విమ్స్ ఆస్పత్రి సిబ్బంది నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదు.

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోనూ....

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోనూ....

తెలంగాణలోనూ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో గతంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.గాంధీలోని ఏఎంసీ వార్డులో ఓ కరోనా పేషెంట్ నుంచి నగలు దొంగలిస్తూ ముగ్గురు వార్డ్ బాయ్స్ పట్టుబడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల కొంతమంది కరోనా పేషెంట్ల బంగారు ఆభరణాలు మాయమవడంతో వారి కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఓవైపు కరోనా సోకిన బాధలో ఉంటే... ఇలా ఆస్పత్రుల్లోనూ ఇంటి దొంగలే చేతివాటం ప్రదర్శిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Recommended Video

AP CM YS Jagan ఇంటి ముందు భజరంగ్ దల్ నిరసన, అరెస్ట్

English summary
In a shocking incident, a covid 19 patient gold rings were theft after he died in Tirupati government hospital. The family of the patient given a complaint to hospital staff but they alleged there is no proper action from their side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X