ఏపీలో షాకింగ్ ఘటన: కూతురికి మద్యం తాగించి తండ్రి అఘాయిత్యం ; వీడియోలు తీయించి ఆపై

కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డలను చెరుస్తున్న మానవ మృగాలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తున్నారు. బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా కామాంధులలో మార్పు రావడం లేదు. కాపాడాల్సిన తండ్రులే కాల యముళ్ళుగా మారి కన్నబిడ్డల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికలను, మహిళలను రక్షించండి మహాప్రభో అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నా ఏపీలో పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

కూతురి జీవితాన్ని నాశనం చేసిన తండ్రి

కూతురి జీవితాన్ని నాశనం చేసిన తండ్రి

తాజాగా ఓ ప్రభుత్వోద్యోగి తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మరోమారు షాక్ అయ్యేలా చేసింది. విజయవాడలో ఇటీవల ఓ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి భార్య ఇంట్లో లేని సమయంలో ఐదేళ్ల కూతురుపై అత్యాచారానికి పాల్పడిన ఘటన, ఆపై విజయవాడలోనే ఓ ఫిజియోథెరపిస్ట్ 13 ఏళ్ళ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే . తాజాగా మరో కామాంధుడు కన్నకూతురి జీవితాన్నే బుగ్గిపాలు చేశాడు.

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి బాలికను తీసుకెళ్ళిన తండ్రి

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి బాలికను తీసుకెళ్ళిన తండ్రి

ఏపీలో ఒక ప్రభుత్వోద్యోగి తన కూతురికి మద్యం తాగించి మరీ అత్యాచారం చేశాడు. ఇక ఆపై వీడియో తీసి మరీ వేధించిన తీరు ఆ తండ్రి పశుప్రవృత్తికి అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్కాపురం లో నివసిస్తున్న ఓ వ్యక్తి కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇక తాను పనిచేస్తున్న ప్రాంతంలోని బేస్తవారిపేట కు చెందిన ఒక మహిళతో నిందితుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో జూలైలో మార్కాపురం నుంచి వచ్చిన నిందితుడు తన 15 ఏళ్ళ కుమార్తెను తనతో పాటు బేస్తవారిపేటకు తీసుకు వెళ్ళాడు.

మద్యం తాగించి అత్యాచారం చేసి .. ఆపై వీడియో తీయించిన తండ్రి

మద్యం తాగించి అత్యాచారం చేసి .. ఆపై వీడియో తీయించిన తండ్రి


అనంతరం సదరు మహిళతో కలిసి బాలికకు బలవంతంగా మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశాడు. కూతురిపై తండ్రి అత్యాచారం చేస్తున్న అత్యంత హేయమైన ఘటనను ఆ మహిళ ఫోన్లో చిత్రీకరించింది. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితుడు బెదిరించడంతో భయపడిన బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోనే ఉంచుకుంది. ఆపై బాలికను ప్రకాశం జిల్లాలో మరోచోట తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో మహిళ దగ్గరకు తీసుకువెళ్లిన తండ్రి అక్కడే బాలికను నెలన్నర పాటు ఉంచాడు.

నెలల పాటు బాలికపై సాగిన రాక్షస క్రీడ .. బాలిక చెప్పిన విషయంతో తల్లి ఫిర్యాదు

నెలల పాటు బాలికపై సాగిన రాక్షస క్రీడ .. బాలిక చెప్పిన విషయంతో తల్లి ఫిర్యాదు


భార్యకు మాత్రం కుమార్తె తన వద్దే ఉందని చెప్తూ నమ్మిస్తూ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడిస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల ఓ బంధువు చనిపోతే బాలికతో కలిసి ఆ చావుకు వచ్చాడు తండ్రి. అక్కడ బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి కూతుర్ని కూర్చోబెట్టి నిదానంగా వివరాలు అడిగి తెలుసుకుంది. భర్త వివాహేతర సంబంధాలను, బాలికపై తండ్రి చేసిన దాడిని గురించి తెలుసుకున్న తల్లి ఒక్క సారిగా షాక్ తింది. దీంతో బాలిక తల్లి కన్నబిడ్డ పై అత్యాచారానికి పాల్పడిన తండ్రిపై సెప్టెంబర్ 25 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోక్సో చట్టం క్రింద తండ్రిపై కేసు నమోదు..

పోక్సో చట్టం క్రింద తండ్రిపై కేసు నమోదు..

పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 2వ తేదీ సాయంత్రం నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అతని దగ్గర ఉన్న మొబైల్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో చదువుకున్నవారు కూడా ఈ తరహా దారుణాలకు, అఘాయిత్యాలకు పాల్పడడం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఎన్ని చట్టాలు వచ్చినా సరే మృగాళ్ళ ఆలోచనలో మార్పు రావటం లేదు. రక్త సంబంధాలను, అనుబంధాలను పక్కన పెట్టి మరీ తండ్రులు చేస్తున్న దారుణ ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+