సినిమా థియేటర్ లో.. లేడీస్ టాయ్‌లెట్‌లో.. ఏం జరిగిందంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయనగరం: సినిమా చూసేందుకు థియేటర్ కు వచ్చిన ఓ మహిళ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై తోటి సిబ్బంది దాడి చేసిన ఉదంతమిది.

విజయనగరం జిల్లా బెలగాం పట్టణంలోని సౌందర్య థియేటర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం 'ఉన్నది ఒక్కటే జిందగీ 'ఉదయం ఆటకు వెళ్లారు. సినిమా మధ్యలో చైతన్య భార్య లేడీస్ టాయిలెట్‌కు వెళ్లారు.

Shocking incident in Ladies Toilet of a Movie Theatre in Belgaum Town

అప్పటికే అందులో శుభ్రం చేయడానికి ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. దీంతో ఆమె బయటకు పరుగు తీసి భర్తకు విషయాన్ని తెలిపింది. వెంటనే చైతన్య వచ్చి కార్మికుడిని నిలదీయగా తోటి కార్మికులు, సినిమా థియేటర్‌ సిబ్బంది చైతన్యపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో చైతన్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త ప్రారంభించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A shocking incident was taken place in a Movie Theatre when a woman went to toilet middle of the show. This incident was happned in Soundarya Theatre of Belgaum Town, Vijayanagaram District. When the woman went to ladies toilet, a Scavenger attacked on her. She rushed into theatre and told about the incident to her husband. When he questioned the Scavenger, he attacked on him too. Staff of the Theatre also supported Scavenger ite seems.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి