మోడీకి మొహం చాటేసిన పవన్ -ఒక్క నిర్ణయంతో నాలుగు సంకేతాలు ? ఫ్యాన్స్ కూడా హ్యాపీ !
ప్రధాని మోడీ భీమవరం టూర్ కు బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రధాని హాజరయ్యే కార్యక్రమానికి అన్న చిరంజీవిని కూడా కేంద్రం ఆహ్వానించడంతో అధికారంగా ఒకే వేదికపై మెగా బ్రదర్స్ ఇద్దరూ కనిపిస్తారని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ సభకు రాకుండా దూరంగా ఉండిపోవడం ద్వారా పలు సంకేతాలు ఇచ్చారన్న చర్చ జరుగుతోంది.

మోడీ టూర్ కు పవన్ డుమ్మా
ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటుందని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటివరకూ ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీంతో బీజేపీ-జనసేన హనీమూన్ కు తెరపడనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఏకంగా ప్రధాని మోడీ హాజరైన భీమవరం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పవన్ కళ్యాణ్ వైఖరి మార్పుకున్నారా లేక రాకుండా మరేదైనా సంకేతమిచ్చారా అనే చర్చ నడుస్దోంది.

పవన్ డుమ్మాపై రాజకీయంగా చర్చ
ప్రధాని మోడీ హాజరైన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందినా రాకుండా ఉండిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని ఇప్పటికే ప్రకటించిన పవన్.. ఈ క్రమంలో బీజేపీకి కూడా దూరం కాబోతున్నారా అన్న చర్చ మొదలైంది. అలాగే భీమవరంలో ఎప్పుడూ ఉప్పూ నిప్పుగా ఉండే కాపు, క్షత్రియ వర్గాలు పోరు కూడా ఇందుకు కారణమైందా అన్న చర్చ కూడా సాగుతోంది. అలాగే వైఎస్ జగన్ తో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని కూడా తెలుస్తోంది.

పవన్ సంకేతాలు ఇవేనా ?
భీమవరం టూర్ కు రాకుండా ఉండటం ద్వారా పవన్ కళ్యాణ్ తన మిత్రులతో పాటు ప్రత్యర్దులకూ కొన్ని రాజకీయ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిలో ముఖ్యమైనది విపక్షాల ఐక్యత. మోడీ టూర్ కు ప్రధాన విపక్ష నేత చంద్రబాబును కేంద్రం నేరుగా ఆహ్వానించలేదు. దీంతో ఇది కేవలం అధికార పక్షాల కార్యక్రమంగా మారిపోయింది. అలాగే బీజేపీతో తెగదెంపుల కోసం ప్రయత్నిస్తున్న పవన్ కు ఇంతకు మించిన అవకాశం మరోసారి దొరికే అవకాశం లేదు. కాబట్టి ఈ దిశగా కూడా పవన్ ఆలోచించి ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే భీమవరంలో కాపులు, వర్సెస్ క్షత్రియులుగా ఎప్పటినుంచో సాగుతున్న పోరులో తాను హాజరైతే సొంత సామాజికవర్గం ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న బెంగ కూడా పవన్ ను పట్టి పీడించిందా అన్న చర్చ సాగుతోంది.

పవన్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ
భీమవరం సభకు పవన్ కళ్యాణ్ హాజరు కాకుండా దూరంగా ఉండిపోవడంపై పవన్ ఫ్యాన్స్ లో మాత్రం సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాపులకూ, రాజులకూ పరిస్ధితి ఉప్పూనిప్పుగా ఉంటోంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ క్షత్రియులకు ఆరాధ్యుడైన అల్లూరి సీతారామరాజు జయంతి సభకు వచ్చి ఆయన గురించి మాట్లాడితే అది మరోలా సంకేతాలు పంపే అవకాశాలు లేకపోలేదు. దీంతో పలు కారణాలతో పవన్ మోడీ సభకు హాజరుకాకుండా దూరంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. కానీ పవన్ నిర్ణయంపై మాత్రం భీమవరంలో ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications