వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిలో టిడిపి ఓటమి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించినా, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైంది. టిడిపి అదినేత చంద్రబాబునాయుడు స్వంత జ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించినా, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైంది. టిడిపి అదినేత చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో కూడ ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ కేవలం ఒక్క సాటును మాత్రమే గెలుచుకొంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నెల్లూరు, కర్నూల్, కడప జిల్లాల్లో అధికార పార్టీ తిరుగులేని విజయం సాధించింది. కడప జిల్లాల్లో సుమారు 34 ఏళ్ళ తర్వాత వైఎస్ కుటుంబాన్ని ఓడించి టిడిపి విజయం సాధించి చరిత్ర తిరగరాసింది.

అయితే గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి ఎదరుదెబ్బతగిలింది. ఈ ఫలితాలు అధికార పార్టీని తీవ్ర నిరాశను కల్గించాయి.

9 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది,. మిగిలిన స్థానాల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బే తగిలింది.అయితే ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు.అయితే పార్టీ నాయకులు, మంత్రులు కూడ ఈ విషయమై కేంద్రీకరించినా ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగానే వచ్చాయి.

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపికి ఒక్క స్థానమే

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపికి ఒక్క స్థానమే

9 జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టిడిపికి ఎదురుదెబ్బతగిలింది.రెండు స్థానాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, మూడు స్థానాల్లో పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఉత్తరాంధ్ర స్థానంలోని టిడిపి బలపర్చిన బిజెపి అభ్యర్థి పిడిఎఫ్ అభ్యర్థిపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.మిగిలిన అన్ని స్థానాల్లో పిడిఎఫ్, వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు.

తొమ్మిది జిల్లాలు లక్షల ఓట్లు

తొమ్మిది జిల్లాలు లక్షల ఓట్లు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.చిత్తూరు జిల్లాలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి పరాజయం పాలైంది.తూర్పు రాయలసమీ పట్టభద్రుల స్థానంలో టిడిపి అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో ఆ పార్టీ కూడ ఓటమిబాట పట్టింది. ఉత్తరాంధ్ర స్థానంలో ఆ పార్టీ బలపర్చిన బిజెపీ అభ్యర్థి పిడిఎఫ్ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీతో ఉన్నారు. లక్షలాది మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా తమ తీర్పును ఇచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ప్రజల నుండి వ్యతిరేక పవనాలను సూచిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఫలితాలతో నిరాశలో టిడిపి

ఎమ్మెల్సీ ఫలితాలతో నిరాశలో టిడిపి

ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలో మిగిలిన నాలుగు స్థానాల్లో అధికార పార్టీ ఓటమిపాలు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశలో ముంచెత్తింది. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రజలు ఓటు చేయరు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఓటు చేస్తారు. గ్రాడ్యుయేట్లు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరుగుతాయి. డిగ్రీ చదివినవారు,.టీచర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొంటారు. దీంతో ప్రభుత్వ పనితీరు పట్ల ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయని వైసిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

వైసిపికి కలిసివచ్చిన పిడిఎఫ్ మద్దతు

వైసిపికి కలిసివచ్చిన పిడిఎఫ్ మద్దతు

ఈ ఎన్నికల్లో పిడిఎప్ అభ్యర్థులకు వైసిపి మద్దతును ప్రకటించింది మిగిలిన స్థానాల్లో కూడ వైసిపి అభ్యర్థుల కోసం పిడిఎప్ పనిచేసింది. ఈ వ్యూహం ఇరువురికి కలిసి వచ్చింది. ఆంద్రప్రదేశ్ లో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కువగా పిడిఎఫ్ అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడ ఉత్తరాంధ్ర మినహ మిగిలిన చోట్ల పిడిఎప్ అభ్యర్థులు విజయం సాధించారు.

English summary
shocking result to tdp in mlc election,out of 5 mlc seats tdp won only one seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X