షాకింగ్ ...లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసు
Recommended Video

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు , లోకేష్ లను టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అల్లుడా , మనవడా అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక ప్రచారంలో దూసుకుపోతున్న లక్ష్మీ పార్వతి పై ఊహించని విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె దగ్గర అనుచరుడిగా గత కొంత కాలంగా పని చేస్తున్న వ్యక్తి .

ఎన్నికల సమయంలో వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి పై వేధింపుల కేసు
వైసీపీ నేత లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తుందని, తల్లిలాంటి భావనతో ఉన్న తనను వేధించొద్దంటూ ఎంత వేడుకున్నా ఆమె వినడం లేదని ఆమె వద్ద గత కొంత కాలంగా అనుచరుడిగా ఉంటున్న కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాకుండా తాను చెప్పినట్టు వింటే వైసీపీలో మంచి పదవి ఇప్పిస్తానని లేదంటే ఇబ్బంది పడతావు అని హెచ్చరికలు జారీ చేసిందని కోటి వినుకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అతని ఫిర్యాదులో ఏ మేరకు వాస్తవం వుందో తెలీదు కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్న లక్ష్మీ పార్వతికి ఈ వార్త పెద్ద షాక్ అని చెప్పాలి.

ఆడియో టేపుల్లో ఎన్టీఆర్ ను అగౌరవంగా మాట్లాడిన లక్ష్మీ పార్వతి ? అసభ్యకర వాట్సప్ చాట్ లను బయట పెట్టిన అనుచరుడు కోటి.
ఈ ఒక్క ఫిర్యాదు మాత్రమే కాదు.. లక్ష్మీపార్వతి చేసినట్లుగా చెబుతున్న కొన్ని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్, ఆమే మాట్లాడినవని మరికొన్ని ఆడియో టేపుల్ని కూడా పోలీసులకు అందించారు కోటి. కోటి బయట పెట్టిన అసభ్యకరంగా చాటింగ్ లో ఐ లవ్ యూ అంటూ.. మరికొన్ని సందేశాలు పంపినట్లుగా ఉంది. ఇక రికార్డ్ చేసిన ఆడియో టేపుల్లో ఎన్టీఆర్ పై ఏ మాత్రం గౌరవం లేకుండా.. లక్ష్మీపార్వతి మాట్లాడినట్లు కోటి ఆరోపణ. చాలా దుర్మార్గాలు చేశారని చెప్పుకొచ్చినట్లు ఫిర్యాదు చేశారు.

ఆధారాలను బయటపెట్టిన కోటి .. కేసు నమోదు చేసిన పోలీసులు
కొద్ది రోజుల క్రితం నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై అనేక ఆరోపణలు చేశారు. అవన్నీ నిజమేనన్నట్లుగా లక్ష్మీపార్వతి మాట్లాడటం ఆడియో టేపుల్లో ఉంది. ఆడియో టేపులలో మోహన్ బాబు ప్రస్తావన కూడా ఉంది. ఆయన వైసీపీలో చేరిన తర్వాతనే ఆ ఆడియోను రికార్డు చేసినట్లుగా ఉన్నారు. ఆయన చంద్రబాబుపై కోపంతో వైసీపీలోకి వచ్చారని మోహన్ బాబు ఒక వేస్ట్ ఫెలో అంటూ ఆమె మోహన్ బాబుని తీసి పారేసింది. ఈ ఆడియో టేపులు , చాటింగ్ స్క్రీన్ షాట్స్ వంటి ఆధారాలతో ఆమెపై లైంగిక వేధింపుల కేసు పెట్టాడు ఆమె అనుచరుడు కోటి. తనకు ఆమెతో ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని కోటి కోరారు. ఆధారాలతో ఫిర్యాదు చెయ్యటంతో వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు వినుకొండ పోలీసులు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications