ఎన్నికల సమయంలో మోహన్ బాబుకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష.. వైసీపీ కి షాక్ ..

ఒక పక్క ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న మోహన్ బాబుకు కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ జైలు శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానాను కూడ విధించింది. ఇక ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని నటుడు మోహన్ బాబు పిటీషన్ దాఖలు చేశారు .

ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే 2010లో దర్శకుడు వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై చెక్ బౌన్స్ కేసును వేశాడు. ఈ కేసులో ఏ 1 లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నాడు. 2010 లో రూ. 48 లక్షలు చెక్ ఇస్తే అది బౌన్సు అయ్యిందని నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్‌, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది.

shocking .. YCP leader Actor Mohan Babu has been sentenced to jail in a check bounce case.

2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై నమోదైన ఈ కేసులో బాధితుడికి కోర్టు ఆదేశాల మేరకు జరిమానాగా రూ.41.75 లక్షలు చెల్లించకపోతే మరో మూడు మాసాల పాటు జైలు శిక్షను పొడిగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం నాడు ఈ కేసు విషయమై ఎర్రమంజిల్ 23 కోర్టు జడ్డిజ వి. రఘునాథరావు తీర్పు వెలువరించారు.

ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి ప్రచారం చేస్తూ బిజీగా ఉన్న మోహన్ బాబుకు శిక్ష విధిస్తూ తీర్పు రావటం అటు వైసీపీ నాయకులకు సైతం షాక్ అని చెప్పొచ్చు . ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఈ తరుణంలో తన వాగ్దాటితో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మోహన్ బాబు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారన్న భావనలో ఉన్న వైసీపీ నేతలకు మోహన్ బాబుపై కోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకు గురి చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+