సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని దాడి, షాప్ ఓనర్ మృతి
విజయవాడ: కృష్ణా జిల్లాలోని వీరులపాడులో దారుణం జరిగింది. సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఓ వ్యక్తి కిరాణా షాపు యజమానిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కిరాణా షాపు యజమాని మృతి చెందాడు.
ఆటోలు ఢీకొని ఏడేళ్ల బాలుడు మృత్యువాత
రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో జరిగింది. రామన్నపేట బ్రిడ్జి వద్ద ఓ లగేజీ ఆటో, ప్రయాణికులతో వస్తోన్న మరో ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జశ్వంత్ కుమార్(7) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

ప్రమాదం జరిగినప్పుడు లగేజీ ఆటో నడుపుతున్న డ్రైవర్ మత్తుగా తాగి ఉన్నాడని తెలుస్తోంది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న స్ధానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వ్యాను బోల్తా 12 మందికి గాయాలు
పెళ్లి బ్యాండు బృందంతో వెళుతున్న ఓ వ్యాను బోల్తా పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని టీబీ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పది మంది బ్యాండ్ బృంద సభ్యులు సహా 12 మంది గాయపడగా వారిని పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పిచ్చికుక్క స్వైర విహారం: ఆరుగురికి తీవ్ర గాయాలు
శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండలం వెంకన్నపాలెంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications