ఇంటి దొంగలే షాపునకు దంపతులు కన్నమేశారు
కరీంనగర్: కిరాణా దుకాణం యజమాని చాతుర్యంతో దొంగలు పట్టుబడ్డారు. ఇల్లు అద్దెకిచ్చిన యజమాని దుకాణానికే దంపతులు కన్నం వేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సిసిటివీ కెమెరాలతో వారి దొంగతనం బయటపడింది. సిసిటివీ ఫుటేజీ సాయంతో దుకాణం యజమానికి ఆ భార్యాభర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వివరాలు ఇలా ఉన్నాయి - నగనూరి వెంకటేశం, అంజలి దంపతులు గోదావరిఖనిలో కళ్యాణ్ నగర్ ఎఫ్‌సిఐ క్రాస్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. కింది పోర్షన్‌లో వెంకటేశం కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. ఆ ఇంటి భవనంపై ఓ వ్యక్తి తన భార్యతో కలిసి తొమ్మిదేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు.

రెండేళ్ల క్రితం దుకాణం తాళం చెవి పోవడంతో వెంకటేశం మారు తాళం చెవి చేయించాడు. అయితే, దుకాణంలోని విలువైన వస్తువులు, సరుకులు మాయం అవుతుండడంతో అతను అయోమయానికి గురవుతున్నాడు. ఇంట్లోని 12 తులాల బంగారం నగలు ఒక్కటొక్కటిగా మాయమయ్యాయి. దీంతో వెంకటేశానికి భార్యపై అనుమానం వచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయి.
అయితే, స్నేహితుడి సలహాతో వెంకటేశం 20 రోజుల క్రితం సిసి కెమెరా ఏర్పాటు చేయించాడు. ఈ నెల 25వ తేదీన బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి వెంకటేశం భార్యతో కలిసి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చిన వెంకటేశానికి ఐదు వేల రూపాయల నగదు, సరుకులు మాయమైనట్లు అర్థమైంది. దాంతో సిసిటీవి దృశ్యాలను పరిశీలించాడు. సిసిటీవి ఫుటేజీని తీసుకుని వెళ్లి వెంకటేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications