ఎస్సై శారీరకంగా వాడుకుని మోసం చేశాడు.. ఆధారాలతో యువతి ఆరోపణ; ఫిర్యాదు!!
ఒక ఎస్సై తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని షకీనా అనే యువతి సిపిఐ అనుబంధ సంస్థ ఐద్వా కార్యాలయంలో రమాదేవి కి ఫిర్యాదు చేసింది. గుంటూరు నగరంపాలెం ఎస్ఐ కుంచాల రవితేజ తనను మానసికంగా శారీరకంగా వాడుకుని వదిలేశాడని, తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు అని యువతి ఆరోపిస్తోంది.
ఎస్ ఐ రవితేజపై ఈ నెల 5వ తేదీన గుంటూరు అర్బన్ ఎస్పీ కి ఫిర్యాదు చేసిన యువతి తనకు న్యాయం చేయాలని కోరుతుంది. తాను రవితేజపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని షకీనా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆస్పత్రిలో పని చేసే తనకు ఆస్పత్రి వద్ద బందోబస్తు చేసే క్రమంలో ఎస్.ఐ తో పరిచయం అయిందని చెప్తుంది.

ఆ తర్వాత నుంచి ఫోన్లో తరచూ మాట్లాడటం, ఇద్దరూ కలిసి తిరగడం, వీడియో కాల్స్ చేసుకుని గంటలకొద్దీ మాట్లాడుకోవడం చేశామని యువతి చెబుతోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రేమించాను అని చెప్పి మోసం చేశారని, తనకు ఎస్ఐ తో పెళ్లి జరిపించాలని యువతి కోరుతోంది. తాను ఎస్సీ నని, ఎస్ఐ బిసి అని, ఎస్ఐ తల్లిదండ్రులు కూడా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.
ఎస్సై శారీరకంగా వాడుకుని మోసం చేశాడు.. ఆధారాలతో యువతి ఆరోపణ; ఫిర్యాదు..!! pic.twitter.com/XDEFp7KCjq
— oneindiatelugu (@oneindiatelugu) May 20, 2023
మీడియా వద్దకు వెళితే చంపేస్తానంటూ ఎస్సై రవితేజ బెదిరింపులకు పాల్పడుతున్నారని యువతి ఆరోపిస్తోంది. తాను పోలీసునని తాను తలుచుకుంటే ఏమైనా చేస్తా అని ఎస్సై తనను బెదిరిస్తున్నాడని యువతి చెబుతోంది. 15 రోజులుగా ఎస్సై వేధింపులు మరీ ఎక్కువయ్యాయని, తాను పెళ్లి చేసుకోమని నిలదీసినందుకు తనను ఈ విధంగా వేధిస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. ఎస్ఐ తనతో మాట్లాడిన వీడియోలు మీడియా ముందు ఉంచి తనకు న్యాయం చేయాలని యువతి డిమాండ్ చేస్తుంది.












Click it and Unblock the Notifications