సిద్ధయ్య మృతికి కలత చెందిన కెసిఆర్: ఎస్ఐ చేతిని తాకిన కుమారుడు

హైదరాబాద్: నల్గొండలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ సిద్ధయ్య మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్యుల కృషి ఫలించకపోవడం బాధాకరమని అన్నారు.

సిద్ధయ్య మరణం ఎంతో కలతకు గురి చేసిందని చెప్పారు. సిద్ధయ్య వీరమరణం పొందారని అన్నారు. ప్రాణాలకు తెగింి ఉగ్రవాదులతో పోరాడరని కెసిఆర్ అన్నారు. సిద్ధయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం కెసిఆర్ చెప్పారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

 SI Siddhaiah death: KCR fray

ఎస్ఐ చేతిని తాకిన కుమారుడు

ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి అసువులు కోల్పోయిన ఆత్మకూరు ఎస్ఐ సిద్దయ్యను అతని కుమారుడు చేతితో తాకాడు. ఎస్ఐ సిద్ధయ్య ఎన్ కౌంటర్లో గాయపడి ఆస్పత్రిలో చేరిన రోజునే అతని భార్య ధరుణేషి పండంటి మగబిడ్డకు అదే ఆస్పత్రిలో జన్మనిచ్చింది.

భర్త పరిస్థితి తెలిసిన ధరుణేషి కుమారుడి చేతితో తండ్రి సిద్దయ్యను తాకించింది. సిద్ధయ్య మరణించే కొద్ది క్షణాల ముందు సిద్ధయ్య శరీరాన్ని అతని కుమారుడు తాకడంతో ఆస్పత్రిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

సిద్ధయ్య మృతితో మిన్నంటిన రోదనలు

సిద్ధయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సిద్ధయ్య చికిత్స పొందిన కామినేని ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్యకు మృతి విషయం తెలియడంతో తీవ్రంగా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

సిద్ధయ్య తల్లిదండ్రులు, అత్తామామలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పై అధికారులు, ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే సిద్ధయ్య మృతి చెందాడని ఆరోపించారు. సిద్ధయ్య సెలవు కావాలని కోరినా సిఐ ఇవ్వలేదని, అతని వల్లే ఇంత ఘోరం జరిగిందని వారు వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+