తల్లిపై కన్నేసిన ఓ ఎస్ఐ, ఆమె కూతురు కిడ్నాప్‌నకు యత్నం

అమరావతి: తల్లిపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు ఆమె కూతురిని కిడ్నాప్‌నకు యత్నించాడు. అయితే ఆతడు ఎస్‌ఐ కావడమే ఇక్కడ విశేషం. వివరాల్లోకి వెళితే ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు జగన్మోహనరావు.

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఓ విద్యార్థిని తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచనతో.. ఆమెను కిడ్నాప్ చేయించడానికి యత్నించాడు. ఇందు కోసం ఒంగోలు లాయర్ పేటకు చెందిన బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఈదుపల్లి సుధారాణి వినియోగించుకున్నాడు.

అయితే సుధారాణి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లే సమయంలో ఆ బాలిక గట్టికా కేకలు వేయడంతో కథ అడ్డం తిరిగింది. స్కూలు వద్దకు స్థానికులు పెద్దఎత్తున గుమికూడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో జగన్మోహనరావు, సుధారాణి అక్కడినుంచి పరారయ్యారు.

SI tries to kidnap 10th class girl to have illigal relation with her mother

ఆ తర్వాత స్థానికుల సాయంతో స్కూలు చుట్టుపక్కల గాలించి ఎట్టకేలకు సుధారాణిని పట్టుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. గతేడాది కూడా ఇలాంటి ఉద్దేశంతోనే అమ్మాయిని జగన్మోహనరావు కిడ్నాప్ చేయించేందుకు యత్నించాడని తెలిసింది.

అయితే అమ్మాయి తరుపు బంధువులు, పెద్దలు రంగంలోకి దిగి ఒప్పందం కుదుర్చుకోవడంతో అతడు మిన్నకుండిపోయాడు. మళ్లీ ఇప్పుడు ఆమె తల్లిపై కన్నేసి, అమ్మాయిని కిడ్నాప్ చేయించడానికి యత్నించాడని పోలీసలు విచారణలో వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+