జగన్‌కు బిగ్ షాక్..టీడీపీలోకి వైసీపీ కీలక నేత..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది.

11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఉంటారా అనుమానం కలుగుతోంది.ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

Sidda Raghava Rao ready to joins tdp

నటుడు అలీ సైతం వైసీపీ ఓడిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ ఓడిపోవడంతో చాలామంది నాయకులు పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈక్రమంలోనే మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించరాయన. 2014లో టీడీపీ , బీజేపీ ఉమ్మడి అభ్యర్దిగా పోటీ చేసిన శిద్దా రాఘవరావుకు జనసేన మద్దతు లభించడంతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా లభించాయి.

దీంతో ఇక్కడ శిద్దా రాఘవరావు గెలుపుసాధ్యమైంది.2019 ఎన్నికల్లో అనూహ్యంగా శిద్దా రాఘవరావును టీడీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంట్‌కు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయించింది. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు ఆ తర్వాత అధికారపార్టీ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. జగన్ సూచనతో టికెట్ దక్కకపోయిన ఆయన వైసీపీలో కొనసాగారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో తిరిగి తన సొంత గూటికి చేరుకోవడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌‌కు పంపారు. జిల్లాకే చెందిన విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ద్వారా టీడీపీలోకి రావడానికి శిద్ధా రాఘవరావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబుతో మాట్లాడి టీడీపీ చేరికకు మార్గం సుగమం చేయాలని గొట్టిపాటిని కోరినట్టు తెలుస్తోంది. మరి కష్టకాలంలో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన శిద్దా రాఘవరావును చంద్రబాబు పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+