చంద్రబాబు భద్రతలో ఆకస్మిక మార్పులు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు జరిగాయి. భద్రత మరింత పటిష్ఠం చేసారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సీఎం భద్రతలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఇప్పటికే ఉన్న ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ తో పాటుగ స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండో లతో కౌంటర్ యాక్షన్ టీంను భద్రతా వలయంలోకి వచ్చాయి. దీంతో, ఇక నుంచి చంద్రబాబు భద్రతలో ఈ టీంలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించనున్నాయి.
కౌంటర్ యాక్షన్ టీం
సీఎం చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ టీంలు రంగ ప్రవేశం చేశారు. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోలు వచ్చారు. తాజాగా ఏర్పాటు చేసిన సిబ్బందికి ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఎన్ఎస్‌జీ కమాండోల సంఖ్యను పెంచారు. ముందు ఆరుగురు కమాండోలు ఉండగా.. ఆ సంఖ్యను 12కు పెంచారు. కాగ, అయితే ఇప్పుడు నక్సల్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కౌంటర్ యాక్షన్ టీంను రంగంలోకి దిగారు.

కీలక మార్పులు
చంద్రబాబు భద్రతా వలయంలో మొత్తం మూడు వలయాలు ఉంటాయి. మొదటి మూడంచెల భద్రతా వలయంలో ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గ్రూప్), రెండవ వలయంలో ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్) ఉుంటుంది. వీరందరికి దూరంలో ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాం డోలు ఉంటారు. మొదటి రెండు బృందాలు ఏదైనా దాడి జరిగితే చంద్రబాబును సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. మూడో బృందంగా ఉండే కౌంటర్ యాక్షన్ టీం మాత్రం.. దాడికి వచ్చిన వారిని ఎదుర్కొనేలా శిక్షణ ఉంటుంది. కుప్పం పర్యటన నుంచి అధికారికంగా కౌంటర్ యాక్షన్ టీం ను ముఖ్యమంత్రి భద్రతా టీంలోకి చేర్చారు.












Click it and Unblock the Notifications