కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల టిక్కెట్ ఎవరికో చెప్పిన శిల్పా: అఖిల తేల్చేసింది.. మెత్తబడ్డారా

నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్‌పై టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇస్తారని చక్రపాణి రెడ్డ

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక టిక్కెట్‌పై టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇస్తారని చక్రపాణి రెడ్డి అన్నారు.

నంద్యాల ఉప ఎన్నికల టిక్కెట్ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఓ వైపు అఖిలప్రియ తన కుటుంబ సభ్యులకే టిక్కెట్ దక్కుతుందని చెబుతున్నారు. వారం క్రితం ఆమె మాట్లాడుతూ ఈ నెల 24న అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు.

నంద్యాలపై మెట్టు దిగిన బాబు: అఖిలప్రియతో జగన్ కొత్త వ్యూహం, తెరపైకి 'భూమా'నంద్యాలపై మెట్టు దిగిన బాబు: అఖిలప్రియతో జగన్ కొత్త వ్యూహం, తెరపైకి 'భూమా'

అంటే ఈ రోజు (సోమవారం) ప్రకటించాల్సి ఉంది. మరోవైపు శిల్పా సోదరులతో భేటీ అనంతరం చంద్రబాబు నంద్యాల టిక్కెట్‌పై శిల్పా మోహన్ రెడ్డి వైపు మొగ్గినట్లుగా ప్రచారం జరిగింది.

దీంతో సస్పెన్స్ పెరిగింది. ఈ రోజు అఖిలప్రియ అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా చంద్రబాబు.. శిల్పా వైపు మొగ్గారా ఈ రోజు తేలిపోవచ్చునని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో దీనిపై శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. ఆ తర్వాత అఖిలప్రియ కూడా తేల్చి చెప్పారు. అభ్యర్థిపై తుది నిర్ణయం అధిష్టానానిదే అన్నారు. చంద్రబాబును కలిశాక, ఆ పేరును తానే స్వయంగా చెబుతానని అఖిల అన్నారు.

టిక్కెట్ కోసం ఇంటింటి ఇంటెలిజెన్స్ సర్వే

టిక్కెట్ కోసం ఇంటింటి ఇంటెలిజెన్స్ సర్వే

ఇందుకోసం ఇంటింటి సర్వే, ఇంటలిజెన్స్ సర్వే జరుగుతోందని చెప్పారు. ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

శశికళకు పట్టిన గతి జగన్‌కు

శశికళకు పట్టిన గతి జగన్‌కు

తమిళనాడులో అనేక అక్రమాలకు పాల్పడి జైలులో ఊచలు లెక్కబెడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు పట్టిన గతే ఇక్కడి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు పడుతుందన్నారు. తండ్రి అధికారాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర సంపదను జగన్‌ కొల్లకొట్టాడన్నారు.

లోకేష్‌పై విమర్శలా?

లోకేష్‌పై విమర్శలా?

తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ ప్రజలు, కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. అలాంటి లోకేష్ పైన ఆరోపణలు ఏమాత్రం సరికాదన్నారు. వేలాది కుటుంబాలకు రూ.28 కోట్ల బీమా అందించిన ఘనత లోకేష్‌ది అన్నారు.

ఎన్నారైల సహకారంతో..

ఎన్నారైల సహకారంతో..

ఎన్నారైల సహకారంతో రాష్ట్రంలో మూడు వేల గ్రామాలను స్మార్ట్ విలేజీలు మార్చేందుకు పాటుపడుతున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి వివరిచారు. శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేం దుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ఆత్మకూరు రైతాంగం చిరకాల స్వప్నమైన సిద్ధాపురం చెరువు ఎత్తిపోతల పనులకు ఖరీఫ్ సీజన్‌కు పూర్తి చేసి పంటపొలాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.

నంద్యాల

నంద్యాల

ఇక, నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. తన తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్థంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీదే తుది నిర్ణయమన్నారు. దీనిపై చర్చిచేందుకు రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చిస్తానన్నారు.

English summary
MLC and Telugudesam Party leader Silpa Chakrapani Reddy clarifies who will get Nandyal bypoll ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X