• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచయిత మరో సంచలనం: అప్పుడేం చేశారు అశోక గజపతిరాజు, సింహాచల ఆలయానికి ‘ప్రసాద్‌’లో చోటు..

|

సింహాచల దేవస్థాన చైర్మన్ సంచయిత గజపతిరాజు మరోసారి తన చిన్నాన్న అశోక గజపతిరాజు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. సింహాచల అప్పన్న ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం 'ప్రసాద్' పథకంలో చేర్చిన విషయాన్ని వీడియో ట్వీట్ చేశారు. తనకు ఇప్పుడు సంతోషంగా ఉంది అని.. గత ప్రభుత్వ హయాంలో ఎందుకు చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. తనపై లేని పోని ఆరోపణలు చేసిన వారికి తనది ఒక్కటే సమాధానం అని.. కష్టపడి పనిచేసి ఆలయాన్ని ప్రపంచస్థాయిలో నిలబెడతానని చెప్పారు.

  Sanchaita Gajapathi Raju On Simhachalam Narasimha Swamy Temple Under 'PRASAD' Scheme
  అప్పుడేం చేశారు.. చంద్రబాబు, అశోక గజపతిరాజు..

  అప్పుడేం చేశారు.. చంద్రబాబు, అశోక గజపతిరాజు..

  దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్మాత్మిక ప్రదేశాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది. పథకంలో భాగంగా నిధులను కేటాయించి.. అభివృద్ది చేస్తోంది. రాష్ట్రంలోని శ్రీశైలం, తిరుపతి ఆలయాలకు పథకం కింద నిధులు మంజూరు చేయగా.. అభివృద్ది జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో సింహాచల అప్పన్న ఆలయాన్ని పట్టించుకోలేదని సంచయిత విమర్శించారు. అశోక గజపతిరాజు గానీ, చంద్రబాబు ప్రయత్నించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసేవారికి ఈ పరిమాణం మౌనం నేర్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  ధన్యవాదాలు..

  ధన్యవాదాలు..

  ప్రసాద్ పథకంలో చేర్చడం ద్వారా ఆలయంలో వసతుల కల్పన చేయొచ్చని సంచయిత తెలిపారు. ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయంగా నిలిపే శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తనకెలాంటి భయం లేదు అని.. మరింత విశ్వాసంతో పనిచేస్తానని చెప్పారు. సింహాచల అప్పన్న ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్‌కు సంచయిత ధన్యవాదాలు తెలిపారు.

   ఇదీ వివాదం..

  ఇదీ వివాదం..

  విజయనగరం పూసపాటి గజపతి రాజుల వంశంలో చివరి ప్రిన్స్ పూసపాటి విజయరాం గజపతి రాజు (పీవీజీ రాజు) తన తండ్రి జ్ఞాపకార్తం మహారాజా అలక నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ (మాన్సాన్) 1958 నవంబర్ 12వ తేదీన ఏర్పాటు చేశారు. విద్య, సంస్కృతి, సంగీతానికి పెద్దపీట వేసిన ట్రస్ట్.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 14 వేల 800 ఎకరాల భూమి నియంత్రణలో ఉంది. దీనికి ప్రస్తుత విలువ రూ.50 వేల కోట్లు ఉంటుంది. దీంతోపాటు 108 ఆలయాలు, వాటి భూములు కూడా ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ఎల్ కేజీ నుంచి పీజీ వరకు 12 విద్యా సంస్థలు ఉండగా.. 15 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1800 మంది ఉపాధి పొందుతున్నారు. ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి గజపతి వంశస్తులే ట్రస్ట్, సింహాచల ఆలయానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

  పీవీజీ.. ఆనంద.. అశోక టు సంచయిత...

  1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్నారు. ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజు బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పీవీజీ రాజు చనిపోయిన తర్వాత ఆనంద గజపతి రాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆనంద మృతిచెందాక అశోక గజపతిరాజు చైర్మన్ అయ్యారు. కానీ ఈ ఏడాది మార్చి 4వ తేదీన ఆనంద గజపతిరాజు రెండో కుతూరు సంచయితను మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ చేశారు. అంతకుముందే సింహాచల అప్పన్న ఆలయ చైర్మన్ చేశారు. జీవో నంబర్ 75తో ఏపీ సర్కార్ జీవో జారీచేసింది. దీంతో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

  ఆనంద రెండో భార్య కూతురు.. సంచయిత...

  ఆనంద రెండో భార్య కూతురు.. సంచయిత...

  సంచయిత.. ఆనంద గజపతిరాజు రెండో భార్య ఉమా కూతురు.. కాగా ఆమె విజయనగరం, విశాఖలో కాక ఢిల్లీలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. రాజకీయంగా బీజేపీ ఆమెకు ప్రాధాన్యం ఇస్తోంది. బీజేపీలో చేరిన సంచయితకు.. చిన్నాన్న అశోకతో సన్నిహిత సంబంధాలు లేవు. అలా తన స్వస్థలంలో మంచి పనులు చేస్తూ దగ్గరయ్యారు. ఈ సమయంలో ఆలయ చైర్మన్, మన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. దీనిని సవాల్ చేస్తూ అశోక గజపతిరాజు కోర్టులో కేసు కూడా వేశారు. కానీ సంచయిత మాత్రం తన తండ్రి, తాత ఆశీర్వాదంతో ముందుకెళతానని చెబుతూ.. ప్రజల్లోకి వెళుతున్నారు.

  English summary
  simhachalam appanna get ‘prasad’ scheme chairman sanchaita gajapati raju said. ashoka gajapati raju and chandra babu naidu not try to this scheme.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X