తెలుగులో మాట్లాడిన మంత్రి ఈశ్వరన్, 'రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం'

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి త్వరలోనే అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

'ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజయదశని శుభాకాంక్షలు' అంటూ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమరావతి విజన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభినందించారు.

అమరావతి నిర్మాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని మంత్రి ఈశ్వరన్ తెలిపారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని ప్రధాని స్వాగతించారన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు.

Singapore Minister Iswaran describes the process of collaboration with AP

భారత్-సింగపూర్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. రాజధాని అభివృద్ధికి తమ సహకారం ఉంటుందంటూ నమస్కారం, థ్యాంక్యూ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తాం: జపాన్‌ మంత్రి తకాచీ

నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి తాము పూర్తి సహకరిస్తామని జపాన్ ట్రేడ్ మినిస్టర్ యెకుషో తకాచీ చెప్పారు. అమరావతి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

అమరావతికి విశిష్ఠ చరిత్ర ఉందని, భవిష్యత్‌లో అమరావతి అద్భుత నగరంగా విరాజిల్లుతుందన్నారు. అమరావతి నిర్మాణంలో తాము పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆసియా, ఫసిఫిక్‌ ప్రాంతానికి ఏపీ గేట్‌వే నిలుస్తుందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+