అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక పని మొదలు, ప్లానే కాదు నిర్మాణంలోను సింగపూర్: బాబు, ఈ ఒప్పందంతో ఏపీకి నష్టమని ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2020 నాటికి హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం అవుతుందని చంద్రబాబు చెప్పారు. ఏపీలో సహజసిద్ధమైన వనరులు ఎన్నో ఉన్నాయని చెప్పారు.

వచ్చే నెల మొదటి వారంలోగా విజయవాడ - సింగపూర్ విమానయాన సేవలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఏపీలో కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు చంద్రబాబు తెలిపారు. సింగపూర్ సంస్థలు ముందుకు వస్తే ఈ ప్రాజెక్టు మరింత వేగవంతమవుతుందన్నారు. సింగపూర్ వంటి దేశంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం సంతోషమన్నారు.

ఇప్పటి వరకు ప్లాన్ జరిగింది, ఇక పని మొదలు

ఇప్పటి వరకు ప్లాన్ జరిగింది, ఇక పని మొదలు

ఇప్పటి వరకు జరిగింది ప్లాన్ (అమరావతి) మాత్రమేనని, ఇక పని మొదలు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజధాని అమరావతికి బృహత్ ప్రణాళిక ఇచ్చిన సింగపూర్.. నిర్మాణంలోను భాగస్వామ్యం వహిస్తుందని చెప్పారు. పెట్టుబడులు, పర్యాటక, పాలన, పౌరసేవల అంశాలపై సింగపూర్ సహకారం అందిస్తుందని తెలిపారు.

 మూడేళ్లుగా సింగపూర్ సహకరిస్తోంది

మూడేళ్లుగా సింగపూర్ సహకరిస్తోంది

సంయుక్తంగా ఏర్పాటు చేసిన జేఐఎస్సీ సమావేశం కావడం ఇది మూడోసారి అని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి ఇలాంటి సమావేశాలు జరుగుతాయన్నారు. మూడు దశల్లో సింగపూర్ కన్సార్టియంకు భూములు కేటాయిస్తామని తెలిపారు. సీడ్ కాపిటల్‌లో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు జరిగేలా చూడటం ఒప్పందంలో భాగమని చెప్పారు. లైబ్రరీ వ్యవస్థను సాంకేతితకంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతామన్నారు. గడిచిన మూడేళ్లుగా సింగపూర్ సహకరిస్తోందన్నారు.

పలు ఒప్పందాలు కుదిరాయి

పలు ఒప్పందాలు కుదిరాయి

ఏడీపీ, సింగపూర్ కన్సార్టియం మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. స్నేహపూరిత సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలపై చంద్రబాబు-ఈశ్వరన్ మధ్య చర్చలు జరిగాయి. అనంతరం ఒప్పందాలు జరిగాయి. సింగపూర్‌లో రైతుల పర్యటనకు సంబంధించిన లఘుచిత్రాన్ని సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు ప్రదర్శించారు.

 ఫేజ్ జీరో అభివృద్ధి, బాబు వినతికి ఈశ్వరన్ ఓకే

ఫేజ్ జీరో అభివృద్ధి, బాబు వినతికి ఈశ్వరన్ ఓకే


చంద్రబాబు - ఈశ్వరన్ సారథ్యంలో జేఐఎస్సీ సమావేశం జరిగింది. అమరావతి స్టార్టప్ ప్రాంతం ఫేజ్ జీరో అభివృద్ధిపై సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం జరిగింది. ఫేజ్ జీరో అభివృద్ధికి అసెండాస్-సింగ్-బ్రిడ్జ్-సెంబ్ కార్ఫ్ సంస్థలు పని చేయనున్నాయి.
మాధ్యమిక, ఉన్నత విద్య విద్యార్థులను సింగపూర్ పంపించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. స్టూడెంట్ ఎక్సేంజ్ కార్యక్రమం కింద సింగపూర్ పంపాలని సీఎం ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రతిపాదనను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అంగీకరించారు.

సీఆర్డీఏ ఆఫీస్ దగ్గర ప్రజా సంఘాలు, రైతుల ఆందోళన

సీఆర్డీఏ ఆఫీస్ దగ్గర ప్రజా సంఘాలు, రైతుల ఆందోళన

ఏపీ - సింగపూర్ మధ్య ఒప్పందాలను నిరసిస్తూ సీఅర్డీయే కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు, రైతులు ఆందోళన చేశారు. సింగపూర్ కంపెనీతో ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నట్లు నినాదాలు చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు ఏపీకి నష్టమని వారు వాపోయారు. కాగా అంతకుముందు, గన్నవరం విమానాశ్రయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు స్వాగతం పలికారు. సింగపూర్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, ఈశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ఈశ్వరన్, చంద్రబాబు మధ్య ముందస్తు జేఐఎస్సీ భేటీ జరిగింది. పది గంటలకు అత్యున్నతస్థాయి జేఐఎస్సీ భేటీ జరిగింది.

English summary
Singapore Minister Iswaran Meets Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X