శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ మంత్రి
సింగపూర్ దేశ మంత్రి కె.షణ్ముగం, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు సింగపూర్ మంత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రాత్రి గెస్ట్ హౌస్‌లో బస చేసిన అనంతరం శుక్రవారం తెల్లవారు జామున శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్నారు. ఈయనతో పాటు మంత్రి నారాయణ కూడా అర్చనసేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగంతం పలికి అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు మరో మంత్రి మృణాళిని కూడా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ పండితులు మంత్రికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.












Click it and Unblock the Notifications