ఏపీ రాజధానికి వరద ముప్పు: రెండు మీటర్ల ఎత్తు పెంచాలన్న సింగపూర్ బృందం
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి కృష్ణానది వరదల ముప్పు నుంచి తప్పించేందుకు సరైన ప్రణాళిక అవసరమని భావించిన సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసినట్లు తెలుస్తోంది.
ఈ నివేదికలో రాజధానికి కృష్ణా నది ముప్పు పొంచి ఉన్నందున అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాంతాన్ని రెండు మీటర్ల ఎత్తు పెంచాలని సింగపూర్ బృందం పేర్కొంది. రాజధానికి ప్రాంతానికి ఒకవైపు కృష్ణా నది, మరో వైపు కొండవీటి వాగు రిజర్వాయర్ ఉండటంతో వీటి నుంచి ముప్పు పొంచి ఉండొచ్చని, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు సింగపూర్ నిపుణులతో ఈ విషయాన్ని సమీక్షించినట్లు తెలుస్తోంది.
ముప్పు నుంచి రాజధాని ప్రాంతాన్ని తప్పించేందుకు గాను సుమారు రూ. 1500 కోట్లతో ఎత్తు పెంచాల్సి ఉంటుందని అంచనా వేశారంట. వర్షాలు బాగా పడినప్పుడు ప్రతి ఏడాది కొండవీటి వాగు పొంగుతుంటుంది. వర్షాకాలంలో కనీసం మూడు టిఎంసిల నీరు ఈ వాగు ద్వారా కృష్ణా నదిలోకి వెళుతుంది.

దీని వల్ల 13 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందుక పరిష్కారంగా రాజధాని ప్రాంతంలోని 10 వేల ఎకరాల భూమిని ఎత్తు చేస్తే మంచిదని సింగపూర్ బృందం సూచించింది. ఇందుకు రూ. 1500 కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రతిపాదన వద్దనుకుంటే, డ్రైనేజీ వ్యవస్ధ, రిజర్వాయర్లు, చానళ్ల వెడల్పు, ఫ్లడ్ గేట్స్‌ను నిర్మించడం మరో పరిష్కారంగా నివేదికలో పేర్కొన్నారు.
కృష్ణా నది వరద నుంచి ముప్పు ఉన్న ప్రాంతంలో చిన్న రిజర్వాయర్లను నిర్మించి, వివిధ ప్రదేశాల్లో చిన్న చిన్న నీటి నిల్వ కుంటలను పటిష్టంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సిఆర్‌డిఏ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. అంతేకాదు
వరద ముప్పును తట్టుకునేందుకు ఇప్పటికే కనీసం ఒక టిఎంసి నీరు నిల్వ చేసే సామర్ధ్యం ఉన్న ఒకటి రెండు రిజర్వాయర్లను నిడమర్రు, నీరుకొండ, తాడికొండతో పాటు వడ్లమాను వద్ద నిర్మించాలని మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications