బాలిక గ్యాంగ్ రేప్....చిన్మయి రియాక్షన్,పవన్ కళ్యాణ్‌ ..?

నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై హైస్కూలు విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను కాల్వలోకి తోసేసి వెళ్లిపోయారు. బిడ్డ కనిపించలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. జాగిలాలను రంగంలోకి దింపడంతో ఈ ఘోరం బయటపడింది.జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలిక మూడు రోజులుగా కనిపించకుండా పోయింది.

బాలిక అదృశ్యంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు పోలీసులకు బాలిక మృతదేహం లభించింది. దీంతో బాలిక స్కూల్ చదివే విద్యార్థులను ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఆ ఇంట్లోని ముగ్గురు బాలురు కూడా బాలిక చదివే పాఠశాలలోనే ఆరు, ఏడో తరగతి చదువుతున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించారు. బాలికపై తాము అత్యాచారం చేశామని ఆ ముగ్గురు బాలురు తెలిపారు. ఆ తర్వాత భయపడి బాలికను చంపి కాల్వలో పడేశామని పోలీసులకు చెప్పారు.

Singer Chinmayi Voices Outrage Over Gang Rape Incident in Andhra Pradesh

ఆ ఘటనపై సింగర్ చిన్మయి స్పందించారు. బాధితురాలు మూడో తరగతి చదువుతుండగా.. నిందితుల్లో ఇద్దరు ఆరో తరగతి, ఒకరు ఏడో తరగతి చదువుతున్నారని ఆమె గుర్తు చేశారుఈ సంఘటన మనలో ఆలోచన కలిగించాలని.. స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ టైమ్ వచ్చిందని చెప్పింది. ఇకనైనా ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించాలని చిన్మయి సూచించారు. ఇదిలా ఉంటే ఆ ఘటనపై నెటిజన్ల ఏపీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 'మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం సినిమా వాళ్లు. ఇప్పుడు తమను ఏలుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవి జరుగుతున్నాయి ' అని పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+