జగన్ కోర్ టీంకి ఉచ్చు, నెక్స్ట్ ఇక - హైకోర్టులో కీలక పరిణామం..!!
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందనే ఆరోపణలతో పలువురిని సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసారు. ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం పైన విచారణ సాగుతోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారించిన సిట్.. మాజీ ఎంపీ సాయిరెడ్డిని విచారించింది. కాగా, జగన్ కోర్ టీంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కోర్టులో మెమో దాఖలు చేసింది. కోర్టు అనుమతిస్తే ఈ ముగ్గురిని ఈ కేసులో నిందితులుగా చేర్చనుంది.
కీలక పరిణామం
లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా హైకోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేసారు. లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను చేర్చారు సిట్ అధికారులు. ఇటీవల అరెస్ట్ అయిన కేసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్యాల రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో పేర్కొన్నారు. ఇప్పటికే.. తమకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని నిన్న (సోమవారం) సుప్రీం కోర్టుకు ఈ ముగ్గురు ఆశ్రయించారు.

ముందస్తు బెయిల్
కాగా, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే ఈ కేసును చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది రెండు రోజుల క్రితం కోరారు. అప్పటి వరకు కూడా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఈ ముగ్గురు హైకోర్టును అభ్యర్థించారు.
కోర్టులో మెమో
వీరి అభ్యర్ధనను కోర్టు నిరాకరించింది. దీంతో ముగ్గురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వీరికి నిరాశే ఎదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో పాటు ఈ కేసులో జోక్యం చేసుకుందు కూడా నిరాకరించింది సుప్రీం ధర్మాసనం. దీంతో ఈ ముగ్గురు పేర్లను ఈ కేసులో చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది. ఈ మెమోను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. కోర్టు ఈ మెమోను పరిగణలోకి తీసుకుంటే ఈ ముగ్గురిని ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులుగా చేర్చేందుకు మార్గం సుగమం అవుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications