కల్తీ నెయ్యి పై సిట్ చేతికి కీలక సమాచారం..!!
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం పై సిట్ విచారణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే సిట్ ప్రాధమిక సమాచారం సేకరించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు సిట్ సభ్యులు వెళ్లారు. వైష్ణవి, ఏఆర్ డెయిరీ, చెన్నై ల్యాబ్‌లో బృందా లు విచారణ చేసాయి. అన్ని కోణాల్లో వివరాలు సేకరించారు. రెండు డెయిరీల నుంచీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డెయిరీలో 13 గంటల పాటు సోదాలు అవసరమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
కీలక సమాచారం
కల్తీ నెయ్యి గుట్టు రట్టు చేయటానికి సిట్ రంగంలోకి దిగింది. సిట్ లోని డీఎస్పీలు ముందుగా నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో విచారణ ప్రారంభించారు. సిట్ లోని ఒక బృందం వైష్ణవి డెయిరీకి, మరో బృందం తమిళనాడులోని దిండుగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీకి, ఇంకోటి చెన్నైలోని ఎస్‌ఎంఎస్ ల్యాబ్ లో విచారణ చేసాయి. ఇదే సమయంలో.. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ పైన ప్రత్యేకంగా టీం సభ్యులు ఫోకస్ చేసాయి. తాము సరఫరా చేసిన నెయ్యి నాణ్యమైనదిగా పేర్కొంటూ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించడం పైన సిట్ ప్రత్యేకంగా విచారణ చేస్తోంది.

సంస్థల్లో విచారణ
నెయ్యి తయారీ కి అమలు చేస్తున్న నాణ్యతా ప్రమాణాలు..పరీక్షించే పరికరాలు నెయ్యి సాంద్రత, నాణ్యతను గుర్తించిన నిపుణులు ఎవరు? ఎస్‌ఎంఎస్ ల్యాబ్ నుంచి బయట ఎక్కడికైనా నమూనా లు పంపించి టెస్టులు చేయించి రిపోర్టులు తెప్పిస్తున్నారా.. వంటి అంశాల పైన సిట్ సభ్యులు ఆరా తీస్తున్నారు. ఏఆర్ డెయిరీ నెయ్యి నాణ్యతను పరీక్షించి, సర్టిఫికెట్ జారీ చేసిన ల్యాబ్ నిపుణుల గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అధికారుల బృందాల్లో ఒకటి వైష్ణవి డెయిరీలో, మరొకటి దిండుగల్‌లోని ఏఆర్ డెయిరీలో తనిఖీలు నిర్వహించాయి. ఈ డెయిరీల్లో ఉత్పత్తి సామర్ధ్యం.. ప్రాసెస్ విధానం.. పాల నుంచి ఎంత శాతం వెన్న తీస్తున్నారనే కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు.
కీలక సమాచారం
అసలు ఈ సంస్థలే నేరుగా టీటీడీకి నెయ్యి ఉత్పత్తి చేస్తున్నాయా అనేది ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇతర డెయిరీల నుంచి సేకరించి పంపుతున్నాయనే ఆరోపణల పై నిగ్గు తేల్చేందుకు వివరాలు సేకరిస్తున్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని సిట్ బృందం ప్రాథమిక పరిశీలనలో గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో, ఆ డెయిరీకి సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత లోతుగా సమాచారం సేకరించిన తరువాత సంస్థకు చెందిన యాజమాన్యం ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. అదే విధంగా టెండర్ల ఖరారు నుంచి వివాదం బయటకు వచ్చిన వరకు పూర్తి సమాచారం సేకరించేలా సిట్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications