జగన్ కోటరీలోని ఆ ముగ్గురు 'ఫిక్స్' - లిక్కర్ కేసులో కీలక పరిణామం..!!

లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి సైతం జైలులో ఉన్నారు. జగన్ హయాంలో కీలకంగా పని చేసిన మరి కొంత మందికి ఉచ్చు బిగుస్తోంది. జగన్ పేరును ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన సిట్ ఈ రోజు అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. వచ్చే నెలలో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కాగా, జగన్ కోటరీలోని ఆ ముగ్గురు పైన కీలక ఆధారాలు సిట్ సేకరించినట్లు తెలుస్తోంది.

కీలక పరిణామాలు
ఏపీలో లిక్కర్ కేసు సంచలనంగా మారుతోంది. సిట్ ఈ రోజు మరో అనుబంధ చార్జిషీట్‌దాఖలు చేసేందుకు సిద్ధమైంది. గత నెల 19న మొదటి చార్జిషీట్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దాఖలు చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో కింగ్‌ పిన్‌ రాజ్‌ కసిరెడ్డితో(ఏ-1)పాటు ఆరుగురు నిందితులు, పది సంస్థల పాత్రను ఈ చార్జిషీట్‌లో వివరించింది. మూడువారాల తర్వాత మరో అభియోగ పత్రాన్ని సోమవారం కోర్టుకు సమర్పించనుంది. ముగ్గురు కీలక నిందితుల పాత్రతోపాటు ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి..ఎవరు ఎంత లబ్ధి పొందారు.. అంతిమ లబ్ధిదారుకు చేరడానికి ముందున్న ఆ ముగ్గురు వ్యక్తులకు దక్కిన వాటా, లావాదేవీల వివరాలు రెండో చార్జిషీట్‌లో కోర్టుకు వివరించనున్నట్లు తెలిసింది.

sit-to-file-additional-charge-sheet-in-liquor-case-today-details-here

ముగ్గురి పాత్ర
ఈ అనుబంధ ఛార్జ్ షీట్ లో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌ రెడ్డి,మాజీ సీఎం కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌లో శాశ్వత డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప పాత్రపై చార్జిషీట్‌లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో 2019 జూన్‌ నుంచి 2024 మే వరకూ ధనుంజయ్‌ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం పాలసీ రూపకల్పన నుంచి రాజ్‌ కసిరెడ్డి గ్యాంగ్‌ వసూలు చేసిన ముడుపులను అంతిమ లబ్ధిదారుకు చేర్చే వరకూ ఆయన ఏమేం చేశారనే దానిపై వివరించినట్లు తెలుస్తోంది. లిక్కర్‌ సిండికేట్‌ సమావేశాలకు తరచూ ధనుంజయ్‌ రెడ్డి సమీక్షలు చేయటంతో పాటుగా.. ముడుపుల సొమ్ములో తన వాటా సొంత కారులోనే తీసుకెళ్లేవారని సిట్‌ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది.

కీలక ఆధారాలు
కాగా, కృష్ణమోహన్‌ రెడ్డి అంతిమ లబ్ధిదారు సూచనలను సిండికేట్‌కు చేరవేయడం, ముడుపులను తీసుకెళ్లి జాగ్రత్తగా చెప్పిన చోటుకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారని సిట్‌ గుర్తించింది. తన వాటా సొమ్మును హైదరాబాద్‌, బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుసుకుంది. బాలాజీ గోవిందప్ప ముడుపుల సొమ్ము రీరూటింగ్‌లో మాస్టర్‌ మైండ్‌గా వ్యవహరించారని గుర్తించింది. పలు డిస్టిలరీల యజమానులు హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్పకు నేరుగా ముడుపులు చెల్లించినట్లు సిట్‌ విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది దీంతో ఆయన కార్యాలయం, ఇంట్లో సోదాలు చేసి కొన్ని ఆధారాలను సిట్‌ అధికారులు సేకరించారు. ఈ వివరాలతోపాటు ఇటీవల హైదరాబాద్‌ శివారులో గుర్తించి స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల గుట్టు సైతం తాజా చార్జిషీట్‌లో సిట్‌ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల సిట్‌ అధికారులు దాఖలు చేయనున్న మరో ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+