సర్వీస్ ప్రొవైడర్లు: ఏపీ సిట్ చేతికి టీ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఏపీ సర్కారులోని కీలక అధికారులు, నేతల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తెలంగాణ సర్కారు జారీ చేసిన ఆదేశాల కాపీలను ఏపీ సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం)కు సోమవారం అందనున్నాయి.

విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్‌లో జరగనున్న విచారణకు పలువురు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వస్తున్నారు. వారు తమ వెంట ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాపీలను తీసుకు వస్తున్నారని భావిస్తున్నారు.

SIT to interrogate Telecom service providers in phone tapping

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తమ ముందు విచారణకు హాజరు కావాలని 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆధారాలను ఇవ్వాలని కూడా ఆదేశించింది.

టెలికాం ఆపరేటర్లు సోమవారం భవానీపురం పోలీసు స్టేషన్‌లో హాజరు కానున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానల్, సాక్షి న్యూస్ చానళ్లకు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు లభించాక మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+