సిట్ నివేదిక సిద్దం - లిస్టులో ముఖ్య నేతలు..!?

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ కీలక సమాచారం సేకరించింది.గొడవలు జరిగిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అన్ని కోణాల్లోనూ విచారించింది. బాధ్యులను గుర్తించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ ప్రాధమిక నివేదికను ఈ రోజు ఉన్నతాధికారులకు ఇవ్వనుంది. ఈ నివేదికలో గొడవలకు కారణమైన కొందరు కీలక నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

సిట్ విచారణ
ఏపీలో ఎన్నికల హింస పైన సిట్ పూర్తి స్తాయిలో విచారణ చేస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానికులు, పోలీసుల ద్వారా అసలేం జరిగిందో తెలుసుకున్నారు. తాడిపత్రి అల్లర్లపై నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పరిశీలించింది. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను ఆరా తీసింది. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులను వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేశారు. పల్నాడులో జరిగిన ఘటనల పైన అంబటి రాంబాబు సిట్ అధికారులకు వివరించారు.

SIT to submitt the report over poll violence to the DGP and CS today

సూత్రధారుల గుర్తింపు
సిట్ అధికారులు చంద్రగిరిలో జరిగిన ఘర్షణల పైన విచారించింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన దాడులతో పాటు యూనివర్సిటీ పీఎస్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను సిట్ అధికారులు తెలుసుకున్నారు. పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టపైన భద్రత ఉంటే మారణాయుధాలు ఎలా వచ్చాయని పోలీసులను ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సిట్‌ బృందం పర్యటించింది. మల్లమ్మ సెంటర్‌లో వాహనం తగలపెట్టిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు.

నేడు నివేదిక
తొలుత అల్లర్లు జరిగిన విచేపల్లి, మాచవరం మండలాల్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐ నుంచి తెలుసుకున్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీశారు. ఇదే సమయంలో పల్నాడులో హింసకు చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరి నుంచి సమాచారం సేకరించిన సిట్ ఈ రోజు డీజీపీ..సీఎస్ కు ప్రాధమిక నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయి..నివేదికలు ఏ అంశాలు ప్రస్తావించారనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+