వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత - కేంద్రం ఢిల్లీ తీసుకెళ్లే వేళ..!!

|
Google Oneindia TeluguNews

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె.. శతాధిక వృద్ధురాలయిన ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఉంటున్న ఆమె కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లో రాత్రి తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు న్నారు. వందేళ్ల జెండా పండుగ సందర్భంగా గతేడాది సీఎం జగన్ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితో పాటుగా కుటుంబ సభ్యులను సన్మానించారు. రూ 75 లక్షలను అందించారు.

వచ్చే నెల 2న పింగళి వెంకయ్య జయంతి. దీనిని పురస్కరించుకొని కేంద్రం సీతామహాలక్ష్మిని ఢిల్లీ తీసుకెళ్లేంందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె కన్నుమూశారు. మధ్యాహ్న సమయంలో అస్వస్థతగా అనిపించడంతో తనతో పాటు ఇంట్లోనే ఉన్న కుమారుడు నరసింహానికి తాను చనిపోతున్నానంటూ చెప్పారు. అయితే నీకేం కాదంటూ నరసింహం ఆమెకు ధైర్యం చెప్పారు. రాత్రి 8గంటల సమయంలో ఆమెలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుమారుడు వైద్యునికి ఫోన్‌ చేయగా ఆయన పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. సీతామహాలక్ష్మికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం.

Sita Mahalakshmi, daughter of National Flag designer Pingali Venkaiah passed away

జాతీయ జెండా రూపొందించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గతేడాది మార్చి 12న సీఎం జగన్‌ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితో ముచ్చటించారు. అలాగే ఈ ఏడాది మే 10న తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మాచర్ల చేరుకొని సీతామహాలక్ష్మిని కలిశారు. పింగళి సీతామహాలక్ష్మీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసారు.

English summary
Ghantashala Sita Mahalakshmi, daughter of National Flag designer Pingali Venkaiah and centenarian, passed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X