హీరో శివాజీ సంచలనం - మరో పార్టీతో టచ్ లో వైసీపీ 49 మంది ఎమ్మెల్యేలు : జగన్ సినిమా లేదు..!!
వైసీపీ పైన హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. 2019 ఎన్నికల ముందు అనేక అంశాల పైన మాట్లాడిన శివాజీ.. కొద్ది కాలంగా అమరావతి అంశానికే పరిమితం అయ్యారు. కాగా, ఇప్పుడు వైసీపీ ఎంపీలు..ఎమ్మెల్యేల పైనే సంచలన ఆరోపణలు చేసారు. వైసీపీకి చెందిన 9 మంది ఎంపీలు..49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పైనా వ్యాఖ్యలు చేసారు. జగన్ సినిమా మొత్తం అయిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రజల్లోకి వెళ్తారని చెప్పుకొచ్చారు.
హైకోర్టు తీర్పు తరువాత అమరావతి రైతులు వేడుకలు నిర్వహించారు. ఇందులో పలు పార్టీల నేతలతో పాటుగా శివాజీ సైతం హాజరయ్యారు. ప్రజలు కట్టే పన్నును వాడికి వీడికి పంచే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ కాలంలో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలను శివాజీ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి తన స్థానాన్ని గెలుచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందని.. ఆయన బాబాయి వివేకానందరెడ్డి ఉంటే విజయం కొంచెం సులువయ్యేదని వ్యాఖ్యానించారు.

Recommended Video
తాడికొండ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి అమరావతి ఏమైందో అడగాలని మహిళలకు సూచించారు. రాష్ట్రంలో యువతకు చేపల కొట్లు, జొమాటో డెలివరీ బాయ్ ఉద్యోగాలే గతి అంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా గురించి సీఎం మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఓటుకు 50 వేలు ఇచ్చినా ఈ సారి వైకాపా గెలిచే పరిస్థితి లేదన్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో జగన్ ..వైసీపీ గురించి శివాజీ విమర్శలు చేసారు. అయితే, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జగన్ భవిష్యత్ తో పాటుగా పార్టీ నుంచి ఎంపీలు - ఎమ్మెల్యేల మరో పార్టీతో టచ్ లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. మరి..వీటి పైన వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications