పవన్ తల్చుకుంటే బీజేపీ దిగొస్తుంది: శివాజీ, షాకిచ్చిన పురంధేశ్వరి

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు శివాజీ అన్నారు. ఆదివారం ఆయన ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రత్యేక హోదాపై ఎందుకు ముందడుగు పడటం లేదో పవన్ కళ్యాణ్ అడగాలని కోరారు. పవన్ కల్పించుకుంటే బీజేపీ దిగొస్తుందన్నారు. తనకు ఎవరు మద్దతు పలకకపోయినప్పటికీ, ఎవరంతట వారు హోదా కోసం పోరాడాలన్నారు. తన దీక్ష శాంతిమార్గంలో సాగుతుందని చెప్పారు.

చిత్ర పరిశ్రమ పెద్దలు, పవన్‌ కళ్యాణ్ లాంటి నాయకులు పెద్ద మనసుతో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. ఇది తాను స్వార్థం కోసం చేయడం లేదన్నారు. విభజన జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ప్రత్యేక హోదా ఏదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు వద్దన్నారు.

Sivaji urges Pawan Kalyan, fight for Special Status

నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూడలేక ఒక సామాన్య వ్యక్తిగా డిమాండ్‌ చేస్తూ దీక్షను ప్రారంభించానన్నారు. నా దీక్ష పార్టీలకు సంబంధించిన అంశం కాదన్నారు. వ్యక్తిగతంగా చేస్తున్నానని తెలిపారు. శివాజీ దీక్షకు కారెం శివాజీ, వసంత నాగేశ్వర రావు తదితరులు సంఘీభావం ప్రకటించారు.

శివాజీకి షాకిచ్చిన పురంధేశ్వరి

ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న నటుడు శివాజీకీ మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి షాకిచ్చారు. శివాజీ బీజేపీ సభ్యుడు కాదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, పోలవరం నిర్మాణానికి కేంద్రం 90 శాతం నిధులు ఇస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+