అమరావతి: విజయవాడకు చేరుకున్న శివమణి, కేంద్ర మంత్రి వీకే సింగ్ గైర్హాజరు

అమరావతి: గురువారం జరిగనున్న నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రఖ్యాత సంగీత కళాకారుడు శివమణి విజయవాడకు చేరుకున్నారు. ఈ విషయాన్ని శివమణి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపారు.

స్పైస్ జెట్ విమానంలో విజయవాడకు చేరుకున్న శివమణి ఆ తర్వాత ప్రయాణం ఫొటోలను కూడా జతచేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్' శివమణి తన డ్రమ్స్ తో సభా ప్రాంగణాన్ని హోరెత్తించనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.

Going to Amaravathi, for a show tomorrow for Andhra Pradesh's Capital Foundation.

Posted by Sivamani on Wednesday, October 21, 2015

అమరావతి శంకుస్థాపనకు కేంద్ర మంత్రి వీకే సింగ్ గైర్హాజరు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేంద్ర మంత్రి వీకే సింగ్ గైర్హాజరవుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రమంత్రి వీకే సింగ్ లేఖ రాశారు. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్-3కు హాజరవుతున్నందున శంకుస్థాపన మహోత్సవానికి రాలేకపోతున్నామని లేఖలో కేంద్రమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రంపంచలోనే అందమైన నగరంగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, మాజీ ప్రధాన సైనికాధికారి వీకే సింగ్ అభినందనలతో ముంచెత్తారు. అమరావతి రాజధానికి సమయం దగ్గర పడుతుండటంతో సామాన్యులు, ప్రముఖులు తరలి వస్తున్నారు.

గురువారం నాడు రావడం కష్టమవుతుందని భావించి.. చాలామంది బుధవారమే వస్తున్నారు. మరోవైపు స్థానికులు శంకుస్థాపన వేదికను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ ఇదీ...

మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన ప్రాంతానికి ప్రధాని మోడీ చేరుకుంటారు.
12.30-12.35 మధ్య మోడీ అమరావతి గ్యాలరీ సందర్శిస్తారు.
12.35-12.43 మధ్య శంకుస్థాపనలో పాల్గొంటారు.
12.43-12.45 మధ్య ప్రధాన వేదిక వద్దకు ప్రధాని మోడీ చేరుకుంటారు.
12.45-12.48 మధ్య ప్రధానికి, అతిథులకు పుష్పగుచ్చాలు అందిస్తారు.
12.48-12.50 వరకు మా తెలుగు తల్లికి గీతాలాపన
12.50-12.53 వరకు జపాన్ మంత్రి యోసుకే తకాగి ప్రసంగిస్తారు.
12.53-12.56 సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం.
12.56-1.01 వరకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగం.
1.01 - 1.11 వరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం.
1.11 - 1.43 వరకు ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
1.43 - 1.46 వరకు ప్రధాని, అతిథులకు జ్ఞాపికలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+