ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు-బీజేపీ నేతల్ని చితకొట్టిన వైనం- తీవ్ర గాయాలు
ఏపీలో అధికార వైసీపీ ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేసుకుని బీజేపీ చేస్తున్న ఆరోపణలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలపై అధికార పార్టీ విరుచుకుపడుతోంది.ఇదే క్రమంలో ఇవాళ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. దీని ఫలితంగా ఆరుగురు బీజేపీ నేతలు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఇవాళ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నేతల పై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. ఇవాళ ప్రెస్ క్లబ్ వద్దకు వస్తున్న బీజేపీ ముఖ్య నేతల్ని అడ్డగించిన సదరు అగంతకులు విచక్షణారహితంగా దాడి చేశారు. విచక్షణారహితంగా జరిగిన ఈ దాడిలో ఆరుగురు బీజేపీ నేతలు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల్ని ఆస్పత్రిలో చేర్చడంతో పాటు నిందితులు తప్పించుకోకుండా ధర్మవరం సరిహద్దుల్ని మూసేసారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లక్ష్యంగా స్ధానిక బీజేపీ నేత సూర్యనారాయణ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేతిరెడ్డి ఓ స్ధలం కబ్జా చేశారంటుూ ఆరోపించారు. దీంతో నిన్న జరిగిన వైసీపీ ప్లీనరీలో బీజేపీ నేతలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తాను స్థలం కబ్జా చేశానంటూ దుష్ర్పచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా బీజేపీ నేత సూర్యనారాయణ పై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చిన బీజేపీ నేతల్ని ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు దాడి చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ధర్మవరంలో బీజేపీ నేతలపై జరిగిన దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయని, ప్రశ్నిస్తే తమ నేతలపై దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతల అరాచకాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications