విజయనగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం, రియల్టర్‌పై కాల్పులు
విజయనగరం: విజయనగరంలో శనివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్పలరాజుపై పాత నేరస్తుడు బొత్స మోహన్ తుపాకీతో కాల్పులు జరిపాడు.
అప్పల రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని విశాఖలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పలరాజు ఎల్ఐసీ భవనం పక్కన కార్యాలయంలో ఉండగా మోహన్ తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు.

రక్తపు మడుగులో ఉన్న అప్పల రాజును కార్యాలయ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం తరలించారు. పోలీసులు వివరాలు సేకరించారు.
నిందితుడు బొత్స మోహన్ విశాఖ జిల్లాకు చెందినవాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల్లో భాగంగా హత్యయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విజయనగరంలో తొలిసారి తుపాకీ కాల్పులు చోటు చేసుకోవడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది.












Click it and Unblock the Notifications