రేప్ చేసి బాలికను చంపేసి, శవాన్ని బీరావాలో దాచాడు

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. సురేష్ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ బాలికను హత్య చేసి, శవాన్ని బీరువాలో దాచి పెట్టాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లిలో చోటు చేసుకుంది.

బాలిక రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. లావణ్య అనే ఈ బాలిక గురువారం బీరువాలో శవమై తేలింది. అదే కాలనీకి చెందిన సురేష్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చి గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా నిజం చెప్పకపోవడంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతను అసలు విషయం చెప్పాడు.

రెండు రోజుల క్రితం బాలికను కిడ్నాప్ చేశానని, అత్యాచారం చేసి ఎవరికీ తెలియకుండా చంపి శవాన్ని బీరువాలో దాచానని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Six year old girl raped and killed in West Godavari district

నెల్లూరు నగరంలో నగల షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు.

కడప జిల్లాలోని రామాపురం మండలం సూరక్కపల్లిలో దారుణం జరిగింది. గొర్రెలు మేపుతున్న ఇంటర్‌ విద్యార్థినిపై దొంగలు యాసిడ్‌తో దాడి చేశారు. అనంతరం 15 గొర్రెలను అహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+