ఆరేళ్ల చిన్నారిపై కామాంధుడి రేప్: అతని భార్య ఆత్మహత్యాయత్నం
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ళ చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రోళ్ల మండలం కాకి గ్రామానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి అదే గ్రామంలో రెండో తరగతి చదువుతోంది.
ఈ చిన్నారిని అదే గ్రామానికి చెందిన గంగప్ప అనే వ్యక్తి మజ్జిగ పోస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పిన అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడు. ఈ పరిస్థితుల్లో మంగళవారం చిన్నారికి తల్లి స్నానం చేయిస్తుండగా, చిన్నారి ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉండటాన్ని గమనించి గద్దించి అడగడంతో ఆ చిన్నారి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది.

ఆ వెంటనే చిన్నారిని స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గంగప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కాగా, ఆరేళ్ళ చిన్నారిపై తన భర్త అత్యాచారం చేశాడన్న వార్త తెలుసుకున్న గంగప్ప భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే మడకశిర ఆస్పత్రికి తరలించారు. ఈ చిన్నారిపై అత్యాచారినికి పాల్పడిన కామాంధుడి వయసు 52 యేళ్లు ఉంటుంది.












Click it and Unblock the Notifications