ఆరేళ్ల బాలికపై రేప్: చెత్తకుండీలో మగశిశువు
ఒంగోలు /విశాఖపట్నం: మృగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపిన సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విజయ థియేటర్ సమీపంలో ఉన్న చెత్తకుండీలో మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పసికందు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానిక తీవ్ర కలకలం సృష్టించింది.

బ్యాంకులో చోరీకి విఫలయత్నం
విశాఖపట్నం నగరంలోని అచ్చుతాపురం మండలం హరిపాలెంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో గుర్తుతెలియని దుండుగులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు షట్టర్లు తెరచుకోక పోవడంతో ఎదుటి ఇంట్లో రూ.3 లక్షల నగదు, నగలను అపహరించుకువెళ్లారు.












Click it and Unblock the Notifications