ఏసీబీ కోర్టుకు చంద్రబాబు, స్వయంగా వాదనలు: రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ, ఎఫ్ఐఆర్‌లో పేరు చేరిక
విజయవాడ: ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఏసీబీ కార్యాలయానికి తరలించారు పోలీసులు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఏసీబీ కోర్టు వద్దకు న్యాయవాదులు చేరుకున్నారు.
అరెస్ట్ చేసిన 24 గంటలు ముగిసే సమయంలోనే కోర్టుకు చంద్రబాబును తీసుకొచ్చారు పోలీసులు. శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు వద్దకు చేరుకుంటున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. కొద్ది సేపటి క్రితమే ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చింది. 2021 ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. దీంతో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టు ఇచ్చారు సీఐడీ పోలీసులు. కాగా, ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని జడ్జికి టీడీపీ లీగల్ టీం విజ్ఞప్తి చేయడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ37గా చంద్రబాబును చేరుస్తూ రిమాండ్ రిపోర్టు సమర్పించింది సీఐడీ. రూ. 371 కోట్ల కుంభకోణం జరిగిందని అభియోగం మోపింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ అక్రమాలు జరిగాయని తెలిపింది.

తాడేపలల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, 2021 డిసెంబర్ 9 కంటే ముందు నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న సీఐడీ. చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారని పేర్కొన్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరు మీద రిమాండ్ రిపోర్టు సమర్పించారు. 15 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది.
చంద్రబాబు స్యయంగా వాదనలు
సెక్షన్ 409పై వాదనలు కొనసాగుతున్నాయి. ఆరోపణలు కాదు, సాక్ష్యాలు చూపాలని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా సీఐడీకి స్పష్టం చేశారు. కాగా, వాదనలు వినిపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. దీంతో చంద్రబాబు స్వయంగా తనకు తాను వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంతో తనకు సంబంధం లేదని తెలిపారు. రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని చెప్పారు.
#WATCH | TDP chief and former Andhra Pradesh CM N Chandrababu Naidu produced at ACB court in Vijayawada.
— ANI (@ANI) September 10, 2023
CM N Chandrababu Naidu was arrested by the CID in connection with the Skill Development cooperation scam, yesterday. pic.twitter.com/QDn8wuVebJ
అంతకుముందు, తెల్లవారుజామున చంద్రబాబుకు వైద్య పరీక్షలు
శనివారం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచారు. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించారు.
శనివారం సాయంత్రం 5 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆదివారం తెల్లవారుజామునన 3 గంటల వరకూ అంటే సుమారు 10 గంటలపాటు సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. అక్కడ్నుంచి బయటకు వచ్చే సమయంలో చంద్రబాబు నీరసంగా కనిపించారు. కాగా, సిట్ కార్యాలయం నుంచి ఆస్పత్రికి చంద్రబాబును తీసుకెళుతున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశఆరు. అయితే, పోలీసులు వారిని చెదరగొట్టారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications