Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు సచ్ఛీలతపై హరిరామ జోగయ్య అనుమానాలు: జనసేనకు మరో మార్గం లేదు

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాపు సంక్షేమ సేన నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.

అమరావతి: రాష్ట్ర రాజకీయాలన్నీ తెలుగుదేశం పార్టీ- జనసేన పొత్తు (TDP-Jana Sena alliance) వ్యవహారాల చుట్టూ తిరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ- జనసేన (BJP-Jana Sena alliance) సయోధ్య ఆశించినస్థాయిలో ఉండట్లేదనేది ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే ఇట్టే అర్థమౌతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ- మద్దతు ప్రకటించలేదు జనసేన. కనీసం బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా పిలుపునివ్వలేదు.

పవన్ కల్యాణ్ వ్యవహారం..

పవన్ కల్యాణ్ వ్యవహారం..

ఈ వ్యవహారం- బీజేపీని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. అసలే బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా మద్దతు ప్రకటించకపోవడం మరింత అసహనానికి గురి చేస్తోంది బీజేపీని. బీజేపీ (AP BJP) కనీసం నామమాత్రపు పోటీ కూడా ఇవ్వకపోవడాన్ని అటు జనసేన (Jana Sena) కూడా పరిశీలనలోకి తీసుకుంది. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి రావొచ్చనే అభిప్రాయంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇక తెలుగుదేశం పార్టీ వైపే జనసేన మొగ్గు చూపడం దాదాపుగా ఖాయమౌతుందనే అంటున్నారు.

చేగొండి లేఖ..

చేగొండి లేఖ..

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన మధ్య పొత్తు (TDP-Jana Sena alliance) కుదరడం లాంఛనప్రాయమే కావచ్చు. ఈ పరిణామాల మధ్య తాజాగా కాపు సంక్షేమ సేన నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య (Chegondi Hari Rama Jogaiah) రాసిన లేఖ కలకలం రేపుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (Skill Development Scam) లో చోటు చేసుకున్న కుంభకోణం గురించి ఆయన తాజాగా ప్రశ్నలు లేవనెత్తారు.

జగన్ ప్రకటన..

జగన్ ప్రకటన..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Development Scam)పై శాసన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) చేసిన ప్రకటన గందరగోళాన్ని సృష్టిస్తోందని హరిరామ జోగయ్య (Harirama Jogaiah) అన్నారు. 370 కోట్ల రూపాయలను చంద్రబాబు (Chandrababu), ఆయన సొంత మనుషులు తినేశారని జగన్ ఆరోపించారని, దీనిపై సమగ్ర దర్యాప్తును జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులెవరనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో తేలుతుందని చెప్పారు.

నిర్దోషిత్వం నిరూపణ..

నిర్దోషిత్వం నిరూపణ..

వైఎస్ జగన్ స్వయంగా అసెంబ్లీలో చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శేనా లేక నిజమా? అనేది దర్యాప్తులో తేల్చాలని అన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు (Chandrababu) తన నిర్దోషిత్వాన్ని, సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని హరిరామ జోగయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desamm Party)తో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని, అలాంటప్పుడు ఇది ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు.

జనసేనకు మరో మార్గం లేదు..

జనసేనకు మరో మార్గం లేదు..

టీడీపీ (TDP)తో పొత్తు విషయంలో జనసేన ఆత్మరక్షణలో పడుతుందని అన్నారు. నీతిమంతమైన పరిపాలన అందిస్తారని పవన్ కల్యాణ్ పై కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొంటోన్న చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి ఎన్నికల ప్రయాణాన్ని సాగించడం తప్ప జనసేనకు మరో మార్గం లేదని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+