సంతబొమ్మాళి, సారవకోట మండలాల్లో స్వల్పంగా కంపించిన భూమి

హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి, సారవకోట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. గురువారం మధ్యాహ్నాం దాదాపు 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు స్ధానికులు తెలిపారు.

సారవకోట, సంతబొమ్మాళి మండల కేంద్రంతో పాటు నర్సాపురం, కోటాడ తదితర గ్రామాల్లో భూమి కంపించిందని, అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న వస్తువులు కిందపడంతో... ఇళ్లల్లోంచి జనాలు బయటకు పురుగులు తీశారు.

Slight intensity earthquake hits santhabommali in Srikakulam

గురువారం మధ్యాహ్నం 1.45 నుంచి 1.50 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ భూకంపం తీవ్రత ఎంతన్నదీ తెలియాల్సి వుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఐఏఎస్‌లు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఐఏఎస్‌లు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్ధానం ఈఓగా డి. సాంబశివరావు, మున్సిపల్ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శిగా ఎ.గిరిధర్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుల్జార్, ఎంజీ గోపాల్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక గుల్జార్ ఇప్పటికే కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+