ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు : తాజాగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు
భారతదేశంలోనే కాదు ఇటు రాష్ట్రాలలో సైతం కరోనా కేసుల ఊగిసలాట కొనసాగుతోంది. ఏపీలో కరోనా తీవ్రత స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య ఈరోజు స్వల్పంగా పెరిగినట్లుగా తెలుస్తుంది. గత 24 గంటల్లో 3,166 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదైనట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 19,11,231కి చేరింది.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడిన వారు 4,019 మంది కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,65,956 కు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా గడచిన 24 గంటల్లో 21 మంది మృతి చెందారు. చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 21 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,919 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 83,885 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,26,08,072 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులను చూసినట్లయితే అనంతపూర్ జిల్లాలో 102, చిత్తూరు జిల్లాలో 337, తూర్పుగోదావరి జిల్లాలో 664, గుంటూరు జిల్లాలో 239, వైఎస్ఆర్ కడప జిల్లాలో 221, కృష్ణా జిల్లాలో 191, కర్నూలు జిల్లాలో 45, నెల్లూరు జిల్లాలో 259, ప్రకాశం జిల్లాలో 375, శ్రీకాకుళం జిల్లాలో 103, విశాఖపట్నం జిల్లాలో 144, విజయనగరం జిల్లాలో 55, పశ్చిమగోదావరి జిల్లాలో 431 కరోనా కేసులు నమోదయ్యాయి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications