నిర్లక్ష్యం: స్నేక్ గ్యాంగ్ కేసులో సీఐ, ఎస్సైల సస్పెన్షన్
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ కేసు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పహాడీషరీఫ్ సీఐ భాస్కర రెడ్డిని, ఎస్సై వీరప్రసాద్‌లను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో కొద్ది రోజుల క్రితం స్నేక్ గ్యాంగ్ దారుణాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో వారిని సస్పెండ్ చేశారు.

కాగా, కాబోయే భర్తను మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు స్నేక్ గ్యాంగ్‌కు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత వారిపై ఐదు కేసులో నమోదు చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠాకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు.
స్నేక్ గ్యాంగ్ ఆగడాలకు నిలయంగా మారిన పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పాతబస్తీలో దాగిన ఈ విషనాగుల కోసం సైబరాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కోసం పాతబస్తీ ప్రాంతాలైన పహాడిషరిఫ్, షాహిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదా చేశారు. సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదా చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications