రాఘవేంద్ర స్వామి ఆలయంలోకి పాము: పరుగులు పెట్టిన భక్తులు
కర్నూలు: శ్రీ రాఘవేంద్ర స్వామి వారి హుండీలోకి పాము చొరబడి అక్కడి భక్తులను పరుగులు పెట్టించింది. శుక్రవారం ఉదయం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

శుక్రవారం ఉదయం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. ఆలయంలో భక్తులు ఉండగా ఈ క్రమంలో ఓ పాము ప్రవేశించింది. పామును చూసిన భక్తులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
దీంతో భక్తుల రద్దీకి జడిసిన పాము ఆలయంలో ఉన్న హుండీలోకి వెళ్లిపోయింది. దీంతో హుండీలో కానుకలు వేయడాన్ని భక్తులు తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీ దర్శనాలను నిలిపివేసిన ఆలయ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications