Video: ఎయిర్‌పోర్ట్‌లో పాములు.. ప్రయాణికులు షాక్
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం (రేణిగుంట) ఇప్పుడు ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కాకుండా, 'సర్ప' భయాన్ని పరిచయం చేస్తోంది. ఆధ్యాత్మిక రాజధానిగా పిలువబడే తిరుపతికి వచ్చే దేశీ, విదేశీ పర్యాటకులు విమానాశ్రయ ఆవరణలో అడుగుపెట్టాలంటేనే ఇప్పుడు వణికిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో పాముల సంచారం కలకలం రేపుతోంది.
అంతర్జాతీయ విమానాశ్రయం అని బోర్డులు ఉన్నాయి కానీ, కనీస భద్రతా ప్రమాణాలు మాత్రం గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎయిర్‌పోర్ట్ ఆవరణలో, ముఖ్యంగా పార్కింగ్ ప్రాంతాల్లో పాములు విచ్చలవిడిగా సంచరిస్తుండటం ప్రయాణికులను, డ్రైవర్లను బెంబేలెత్తిస్తోంది.

పొదలే నివాసాలు.. పార్కింగే వేట స్థలాలు!
విమానాశ్రయం చుట్టూ ముళ్ల పొదలు విపరీతంగా పెరిగిపోవడం, పరిసరాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడమే ఈ పాముల బెడదకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాత్రి సమయాల్లో పార్కింగ్ చేసిన వాహనాల టైర్ల కింద, ఇంజిన్ భాగాల్లోకి పాములు చేరుతున్నాయి. ప్రయాణికులను దింపడానికి వచ్చే డ్రైవర్లు, లగేజీ ఎక్కించే సిబ్బంది ఎప్పుడు ఎటువైపు నుంచి పాము వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం
విమానాశ్రయ నిర్వహణ (Maintenance) కోసం ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, కనీసం పాములు రాకుండా వాడే 'యాంటీ-స్నేక్ కెమికల్స్' ఉపయోగించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
భద్రత ఎక్కడ?..
అంతర్జాతీయ స్థాయి అని చెప్పుకునే ఎయిర్‌పోర్ట్‌లో కనీసం చెత్తాచెదారం, పొదలను తొలగించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు వాపోతున్నారు.
ప్రమాదం అంచున సిబ్బంది..
గ్రౌండ్ స్టాఫ్ కూడా విధుల్లో ఉండగా పాములను చూసి పరుగులు తీస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అపశ్రుతి జరగకముందే మేల్కొంటారా?
కేవలం ప్రకటనలకు, ప్రోటోకాల్స్‌కు పరిమితం కాకుండా, ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతపై విమానాశ్రయ అధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవించిన తర్వాత స్పందించడం కంటే, ముందే నివారణ చర్యలు చేపట్టాలని భక్తులు, పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి, ప్రయాణికులకు భరోసా కల్పించాలని అందరూ కోరుకుంటున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications