పిరికి సన్నాసి ఎక్కడ దాక్కున్నావ్?
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా, కొణిదెల పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకోలేక 11 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీలోని మంత్రులతో సహా అందరూ ఓటమిబాట పట్టారు. వారిలో ప్రధానమైన వ్యక్తి కొడాలి నాని. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గురించి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై కార్యకర్తలు రగిలిపోయారు.
కొడాలి నాని ఓడిపోవడంతో అతనికి ఉన్న భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వైసీపీ నేతలందరిపై ప్రస్తుతం ట్రోలింగ్ నడుస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాలిదగ్గరే పడుంటా అంటూ కొడాలి నాని సవాల్ విసిరారు. దీనిపై గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి.

'కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి, ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ల దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి.. కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి' అని ఆ ఫ్లెక్సీలో రాసివుంది. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరుతో గుంటూరులో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి.
బూతుల మంత్రులను ఓటుతో కొట్టిన ఓటర్లు
వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో బూతులతో రెచ్చిపోయిన మంత్రులందరినీ ప్రజలు ఇంటికి పంపించారు. వారికి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలందరినీ ప్రజలు నేలకేసి కొట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అతి కష్టం మీద ఆరువేల ఓట్లతో గట్టెక్కగలిగారు. హుందాగా రాజకీయాలు చేయకుండా ప్రతిపక్ష నేతలందరినీ టార్గెట్ చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తే ఓటుతో కొడతామని ప్రజలు నిరూపించారని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications