అందుకే బతికున్నా: శోభ వర్ధంతిలో భూమా కంటతడి

హైదరాబాద్: దివంగత శోభా నాగిరెడ్డి తనకు భార్యగానే కాదని, మంచి స్నేహితురాలు కూడా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి శుక్రవారం అన్నారు. శోభా నాగిరెడ్డి మృతి చెంది ఏడాది అవుతోంది. ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా భూమా మాట్లాడారు.

శోభ లేని లోటు తీరనిదని, ఎంతో బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు తన జీవితంలో వస్తుందని అనుకోలేదన్నారు. ప్రస్తుతం తాను తన పిల్లల కోసమే బతికి ఉన్నానని చెప్పారు. శోభా తన జీవితమంతా కష్టాలే అనుభవించిందన్నారు.

Sobha Nagi Reddy first death anniversary

తమది చాలా పెద్ద కుటుంబమని, అయినప్పటికీ ఆమె తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకునేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా శోభ నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకునే వారన్నారు.

తనకు వైయస్ రాజశేఖర రెడ్డి తప్ప ఎవరు తెలియదని, ఆయన మృతి తర్వాత తాను జగన్‌ను కలిసి, ఆయన సీఎం కావాలని కోరుకున్నానని చెప్పారు. జగన్ సీఎం కావాలని శోభా నాగిరెడ్డి బలంగా కోరుకున్నారని చెప్పారు. ఆమె ఎప్పుడు ఇదే విషయం చెప్పేవారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+