పవన్ పై చెలరేగిన పరకాల : ఆటాడేసుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్: రచ్చ రచ్చే..!!
సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజారాజ్యం మాజీ నేత- జనసేన అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుడిగా పని చేసిన పరకాల ప్రభాకర్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్దిక శాఖా మంత్రిగా ఉన్నారు. నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా పరకాల ప్రభాకర్ కామెంట్లు పోస్టు చేయటం..దానికి స్పందనగా పవన్ అభిమానులు రియాక్ట్ అవ్వటం..వాటికి తిరిగి పరకాల సమాధానం చెబుతూ గట్టిగా కౌంటర్ ఇవ్వటం జరుగుతోంది.
పవన్ పైన పరకాల ట్వీట్లు..
పరకాల ట్వీట్లలో కొన్నింటిని పరిశీలిస్తే.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వాళ్లంటూ పరోక్షం గా జనసేనాని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపించింది. దీనికి కొనసాగింపుగా...పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వటంతో..ఇక పరకాల సైతం ఓపెన్ అయిపోయినట్లుగా ఆయన ట్వీట్లను చూస్తూ అర్దం అవుతోంది. 2009లో కాంగ్రెసోళ్ల పంచెలూడగొడతానంటూ.., మరి కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లంటూ ఒక ట్వీట్ లో ప్రశ్నించారు. అది, మెగా బ్రదర్స్ ను ఉద్దేశించి చేసినదిగానే అర్దం అవుతోంది.

పవన్ రాజకీయ నిర్ణయాల ప్రస్తావన..
ఇక, 2014 లో సైకిల్ ఎందుకు ఎక్కినట్టు.. 2017 లో పాచిపోయిన లడ్డూ అన్నవారు ఇప్పుడు కమలం పువ్వు చెవిలో పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నట్టు.. భీమవరం, వైజాగుల్లో ఏదో పీకేస్తానని తుస్పుమన్నారు శుంఠలు, ఎందుకని.. రేపటి వరకు వీటిల్తో పిసుక్కోండి. రేపు తీరుబడి అయ్యాక మళ్ళీ ఇంకోసారి వీపు పగిలేలా బాదుతా ఇంకా ఏరైనా మిగిలితే..అంటూ ట్వీట్ చేసారు. ఆయన తన ట్వీట్లలో ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించటం లేదు. కానీ, ఆయన చేస్తున్న ట్వీట్లు మాత్రం మెగా బ్రదర్స్ గురించి అనే సమాధానం అభిమానుల నుంచి వస్తోంది.
పవన్ ఫ్యాన్స్ సీరియస్ రియాక్షన్..
అందుకే వారు ఆ స్థాయిలో పరకాలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఒక రకంగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ పరకాల అన్నట్లుగా సోషల్ మీడియాలో యుద్దమే సాగుతోంది. పరకాల పరోక్షంగా తొలుత జనసేనను టార్గెట్ చేసారనేది జనసైనికుల వాదన. ఇక, తాజాగా పరకాల చేసిన వరుస ట్వీట్లలో.. ఇంకా గోక్కుంటున్న గజ్జి బ్యాచ్ కి అంటూ ట్వీట్ చేశారు. కిరాయి ముడుతోందా నన్ను తిడుతున్నందుకు. కానీ జోరు తగ్గిందే. కిట్టుబాటు కావడంలేదా.. సరే, నేల టిక్కెట్-ఈల బ్యాచ్ బాబాయ్‌లకు, పిన్నిలకు, ఈ ప్రశ్నలకు సమాధానం రాయించుకు రండి ఆఫీసులో ఎవరితోనైనా..అంటూ రాసుకొచ్చారు.

పిత్తపరిగి సైన్యం అంటూ..ఖబడ్దార్
ఇక, లేటెస్ట్ గా..పాపం అక్కడక్కడా మూలుగుతూ పడిఉన్న పిత్తపరిగి సైన్యానికి: ఈ సీసన్ చివరి డోస్: మళ్ళీ ఈ ఛాయలకొచ్చారో, ఖబడ్దార్! అంటూ పోస్టు చేసారు. పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటం.. పరకాల ఏపీలో చంద్రబాబు వద్ద మీడియా సలహాదారుడిగా వ్యవహరించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత పరకాల సైతం తన పదవికి రాజీనామా చేసారు. కాంగ్రెస్ - బీజేపీ- ప్రజారాజ్యం పార్టీల్లో పని చేసిన అనుభవం పరకాలకు ఉంది.
Recommended Video

ఆగుతుందా..కొనసాగుతుందా..
అయితే, పరకాల తొలుత పేర్లు ప్రస్తావించకుండా పోస్టింగ్ లు పెడుతూనే..తనను విమర్శిస్తున్న జనసైనికులకు హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఇక, పరకాల సైతం ఓపెన్ అయిపోయారు. పరకాల ట్విట్టర్ ఎకౌంట్ అదే విధంగా వాటికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ చేస్తున్న పోస్టింగ్ లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక నైనా, ఈ వార్ ఆగుతుందా లేక మరింత కాలం కొనసాగుతుందా అనేది ఇప్పుడు తాజాగా పరకాల చేసిన ట్వీట్ కు వచ్చే స్పందన తో స్పష్టం కానుంది.












Click it and Unblock the Notifications