సిబిఐ ప్రస్తుత దుర్గతికి తెలుగువాళ్లేనా కారణం...ఔనంట!...సోషల్ మీడియా తేల్చేసింది...ఇలా

అమరావతి:పాపం సిబిఐ!...ఇప్పుడు ఈ సంస్థ పరిస్థితి చూసిన వాళ్లెవరైనా ఇలాగే అనుకుంటున్నారు. ఏదో తెలుగు సామెత చెప్పినట్లు...అందరికీ శకునం చెప్పే బల్లీ తానే కుడితి తొట్లో పడిందట!...ప్రస్తుతం సిబిఐ పరిస్థితి చూస్తే అచ్చం అలాగే లేదా?....

గతంలో సిబిఐ అధికారులు...అవినీతి కేసుల్లో దర్యాప్తులు...ఆ క్రమంలో చేతివాటాలు...వాటి సంగతేమో కానీ తాజాగా సిబిఐలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొనడానికి...అధిపతులే అరెస్ట్ అవడాలు...మారిపోవడానికి...వీటన్నింటి వెనుక కారణాలు...వెరసి సిబిఐ ఒక్కసారిగా భ్రష్టు పట్టడం వెనుక తెలుగు వ్యక్తులే కనిపిస్తున్నారు. విచిత్రంగా ఆ కారణాలు వెలికి తీస్తోంది మెయిన్ మీడియా కాకుండా సోషల్ మీడియా కావడమే కొసమెరుపు. వివరాల్లోకి వెళితే...

హఠాత్తుగా...ఇలా బ్రేకింగ్స్

హఠాత్తుగా...ఇలా బ్రేకింగ్స్

రెండు రోజుల క్రితం హఠాత్తుగా తెలుగు మెయిన్ మీడియాలో సిఎం రమేష్ ని అక్రమంగా కేసులో ఇరికించేందుకు సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ప్రయత్నిస్తున్నాడని, ఈ క్రమంలో సిఎం రమేష్ పేరును సానా సతీష్ అనే వ్యక్తి చెప్పకపోయినా చెప్పినట్లు రాకేష్ ఆస్థానా ఆదేశాలను అనుసరించి డిఎస్పీ దేవేందర్ అనే అధికారి తప్పుడు స్టేట్ మెంట్ సృష్టించబోయారని...ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయ్యారనే వార్తలు దేశ వ్యాప్తంగా...అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలే సృష్టించాయి. అదే క్రమంలో రాకేష్ ఆస్థానా మీదా కేసు నమోదు చేశారు.

ఒకరిపై ఒకరు...ఎత్తుకు పై ఎత్తు

ఒకరిపై ఒకరు...ఎత్తుకు పై ఎత్తు

అయితే ఆ క్రమంలో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. అయితే రాకేష్ ఆస్థానా అంతకుముందే సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతి పై ఫిర్యాదు చేశారని...ఆ క్రమంలో తనపై వేటు వడే అవకాశం ఉందని అలోక్ వర్మ భావించి...సంస్థ అధిపతిగా తనకున్న విశేష అధికారాన్ని వినియోగించి...నంబర్ టూ స్థానంలో ఉన్న రాకేష్ ఆస్థానానే బుక్ చేసేశారని ఫాలో అఫ్ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ ఆరోపణలు...ప్రత్యారోపణల నేపథ్యంలో అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు వీరిద్దరిని సెలవు మీద పంపుతూ అక్కడి నుంచి తప్పించేసింది కేంద్రం...ఇదీ సిబిఐలో సంక్షోభానికి కారకులైన ఇద్దరు కీలక వ్యక్తుల గురించిన సంక్షిప్త సమాచారం.

తెలుగు రాష్ట్రాలు...ప్రముఖుల పేర్లు

తెలుగు రాష్ట్రాలు...ప్రముఖుల పేర్లు

ఈ నేపథ్యంలో...ఇదే వ్యవహారం గురించి ఇంకొంచెం లోతుగా వెళ్లి పరిశోధించిన కథనాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ఆ ప్రకారం చూస్తే ఎంబిఎస్ జ్యూయలరీ ఓనర్ సుఖేష్ గుప్తా పై బంగారం దిగుమతుల్లో మోసానికి సంబంధించి సిబిఐ కేసు నమోదైతే...ఆ సిబిఐ కేసు నుంచి అతడిని బైటపడేసేందుకు తెలుగువాడైన సానా సతీష్ బ్రోకర్ గా కేసు టేకప్ చేశాడట. ఆ కేసు రాజీ బేరాల్లో పాల్గొనేందుకు తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ నేత, ప్రస్తుతం వైసిపి సీనియర్ నేతగా ఉన్న ఉత్తరాది నాయకుడు వీరితో కలసి...మళ్లీ ఖురేషీ అనే సిబిఐ తరుపు మధ్యవర్తిని(మాంసం వ్యాపారి) కలసి వ్యవహారం నడిపించే ప్రయత్నం చేశారట. అయితే ఈ వ్యవహారంలో సానా సతీష్, ఇటీవల ఐటి దాడులకు గురైన ఒక టిడిపి ఎంపి కలసి తామే సిబిఐతో డైరెర్ట్ డీల్ పెట్టుకొని ఖురేషిని సైడ్ చేశారనేది మరో వాదన.

అలా...సిబిఐని లాగేశారు

అలా...సిబిఐని లాగేశారు

ఆ తరువాత ఈ సానా సతీష్ అనే వ్యక్తి సిబిఐలో రెండు అధికారిక కేంద్రాలనూ మంచి చేసుకునే క్రమంలో అటు డైరెక్టర్ అలోక్ వర్మకూ...ఇటు స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఇద్దరికి వారు కోరుకున్న విధంగా స్టేట్ మెంట్ లు ఇచ్చాడనేది మరో ప్రచారం. ఇక ఆ క్రమంలోనే ఈ రగడ అనేక మలుపులు తిరిగి చివరికి సిబిఐ ఇప్పటి
దుస్థితికి దారి తీసిందని అంటున్నారు. ఆ రకంగా ఈ మొత్తం వ్యవహారంలో తెలుగు వ్యక్తులు సానా సతీష్, పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణాకు చెందిన కీలక కాంగ్రెస్ నేత, ఎపి వైసిపి సీనియర్ నేత, టిడిపి ఎంపి...(ఇంకా లోతుగా వెళ్లే మరికొన్ని ప్రముఖ తెలుగు వ్యక్తుల పేర్లు కూడా వస్తున్నాయి)ఇలా ఇందరు తెలుగు వ్యక్తులు కలసి ఒక్కసారిగా సిబిఐ పాతాళంలో కూరుకుపోయేలా చేశారని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వైరల్ గా మారుతున్నాయి.(పూర్తి నిజాలు పేర్లతో సహా త్వరలోనే వెల్లడవుతాయనే ఆశతో వేచి చూద్దాం)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+