జడ్జి హిమబిందుపై పోస్టులు - చర్యలకు రాష్ట్రపతి భవన్ ఆదేశం..!!
చంద్రబాబు కేసు విచారణ వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు(Chandra Babu) కేసు విచారిస్తున్న ఏసీబీ కోర్టు(Acb Court) న్యాయమూర్తి హిమబిందు(Himabindu) పైన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్స్.. అసత్య ప్రచారం పైన రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదులు అందాయి. దీని పైన రాష్ట్రపతి కార్యాలయం(Rashtrapathi Bhavan) స్పందించింది. వెంటనే మహిళా న్యాయమూర్తి పైన పోస్టింగ్స్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్రపతి కార్యదర్శి సూచిస్తే లేఖ రాసారు.
జడ్జిపై సోషల్ మీడియాలో పోస్టులు : స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ విజయవాడలోని ఏసీబీ కోర్టు(ACB Court)లో ఈ నెల 10న ప్రవేశ పెట్టారు. సుదీర్ఘ విచారణ..వాదనల తరువాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆ సమయంలో చంద్రబాబు కు రిమాండ్ విధించారు. ఆ తరువాత న్యాయమూర్తిని ఉద్దేశించి సోషల్ మీడియాలో టీడీపీ మద్దతు దారులు పోస్టింగ్స్ చేయటం కలకలం రేపింది.

దీని పైన కొందరు న్యాయవాదులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. అటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇదే సమయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది రామానుజం ఈ పోస్టింగ్స్ పైన రాష్ట్రపతి(President)కి ఫిర్యాదు చేసారు. ఒక మహిళా జడ్జిని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రపతి భవన్ జోక్యం : జడ్జిగా కేసుకు సంబంధించిన విచారణ తరువాత నిర్ణయం తరువాత టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టింగ్స్(Social Media Postings) చేసినట్లు గుర్తించారు. అందులో జడ్జి పైన చేసిన అనుచిత పోస్టింగ్స్ వైరల్ అయ్యాయి. వీటి పైన హైకోర్టు న్యాయవాది రామానుజం రాష్ట్రపతి భవన్ కు చేసిన ఫిర్యాదులో వివరించారు. ఒక మహిళా జడ్జి వ్యక్తిత్తవాన్ని..గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించటం పైన ఆవేదన వ్యక్తం చేసారు.

దీని పైన స్పందించిన రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy)కి లేఖ రాసారు. జడ్జి హిమబిందు(Judge Himabindu) పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసిన వారిన పైన చర్యలు తీసుకోవాలని.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఫిర్యాదు దారుడికి వెల్లడించాలని సూచించారు. దీంతో, ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పోలీసు విచారణకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు కేసు విచారణ : చంద్రబాబు స్కిల్ స్కాం కేసు సీఐడీ విచారిస్తుండటంతో ఈ వ్యవహారం ఏసీబీ కోర్టు(ACB Court) పరిధిలో ఉంది. తాజాగా శుక్రవారం ఏసీబీ కోర్టు జడ్జి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చంద్రబాబును విచారించారు. జైలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీసారు. చంద్రబాబు(Chandra Babu) పైన ప్రస్తుతం ఆరోపణలే అని..నిర్దారణ కాలేదని పేర్కొన్నారు. రిమాండ్ లో ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కు రెండు రోజులు రిమాండ్ విధించిన జడ్జి...ఆ తరువాత సీఐడీ కస్టడీకి అనుమతి సమయంలో ఆనేక మార్గదర్శకాలు నిర్దేశించారు.












Click it and Unblock the Notifications